Health

ఈ కాలంలో వచ్చే పుట్టగొడుగులు తింటే ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

కుళ్ళి పోతున్న పదార్ధాలున్న చోట పెరుగుతుంటాయి కాబట్టి మష్రూమ్స్ అంటే ఒక రకమైన ఏహ్యభావం ఉండటం సహజం . అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు . అందరూ తినగల కూర ఆహారము . ఇవి మాంసాహారముతో సమానము . ఆహారప్రియులకు వర్షాకాలము స్పెషల్ పుట్టగొడుగులు. అయితే అయితే వానకాలంలో వీటిని తినడం వల్ల కొంతమంది తీవ్ర అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది.

అలాగే కీళ్ల నొప్పులు, ఆస్తమా, మల్టిపుల్ స్ల్కెరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు బారిన పడినవారు కూడా పుట్టగొడుగులను తీసుకోకూడదు. కానీ వాటిని తిని అనారోగ్యాలను తెచ్చి పెట్టుకుంటున్నారు. వీటిని తినడం వల్ల ప్రధానంగా ఐదు సైడ్ ఎఫెక్టులు కలుగుతాయి. పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలలో వికారం, వాంతులు, అతిసారం వంటివి ఎక్కువగా వస్తాయి. పుట్టగొడుగులు తిన్నాక 20 నిమిషాల నుండి నాలుగు గంటల మధ్య ఈ లక్షణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అలాగే పుట్టగొడుగులు తిన్న తర్వాత అవి సరిగా అరిగినట్లు అనిపించవు. దీనివల్ల పొట్ట అసౌకర్యంగా అవుతుంది. విపరీతమైన నీరసం వస్తుంది. అలసట బారిన పడేవారు అధికంగా ఉంటారు. కొన్ని పుట్టగొడుగులలో కొన్ని రకాల కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణం కావు. ఈ కార్బోహైడ్రేట్లు జీర్ణం కాకపోవడం వల్ల ఇది పెద్ద పేగు గుండా వెళుతున్నప్పుడు అక్కడ పులిసిపోతాయి. దీనివల్ల విపరీతంగా గ్యాస్ ఉత్పన్నమవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పుట్టగొడుగులు శరీర రోగనిరోశక్తిని పెంచుతాయి.

కానీ కొంతమందిలో ఈ పుట్టగొడుగులు చర్మ ఎలర్జీకి కారణం అవుతాయి. చర్మంపై దద్దుర్లు, చికాకులు వస్తాయి. మరి కొంతమందికి ముక్కు నుండి రక్తస్రావం రావడం, నోరు పొడిబారిపోవడం, ముక్కు పొడిబారిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. ఇలాంటి సమస్యలు కనిపిస్తే వారు పుట్టగొడుగులను తినకపోవడమే మంచిది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పుట్టగొడుగులకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇవి ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయో అంచనా వేయడం కష్టం.

కాబట్టి పుట్టగొడుగులను తినడం మానేసి మిగతా ఆహారాలను తినడమే మంచిది. కొందరిలో పుట్టగొడుగులు తినడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న స్థాయి నుండి తీవ్రమైన స్థాయి వరకు యాంగ్జయిటీ రావచ్చు. పుట్టగొడుగులను మితంగా కాకుండా అధికంగా తినడం వల్ల ఇలా మానసిక ఆందోళన బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వానాకాలంలో పుట్టగొడుగులను దూరం పెట్టడం ఉత్తమం. సాధారణ సమయంలో కూడా అవి మీకు పడనట్టు అనిపిస్తే వాటిని తినక పోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker