News

“రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..?

పాత్రకు తగినట్టుగా హావభావాలు పలికించడం అంత సులువు కాదు. తక్కువ మంది చైల్డ్ ఆర్టిస్ట్ లకు ఆ టాలెంట్ ఉంటుంది. అలా టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలైనా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ అన్నీ. అనుకోకుండా ఒక రోజు అనే సినిమాతో అన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు.

ఇటీవలే తేజ సజ్జ కూడా హీరోగా రాణిస్తున్నాడు, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటించిన రాజన్న సినిమాలో మెప్పించింది. అనుకోకుండా ఒక రోజు సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆమె పేరు అన్నీ. రాజన్న సినిమాలో నాగార్జున కూతురు మల్లమ్మగా నటించింది అన్నీ.

అలాగే రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో చరణ్ సిస్టర్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందో తెలుసా.. అన్నీ ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. చూడముచ్చటగా ఎంతో క్యూట్ గా ఉంది అన్నీ. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల్లో స్పీడ్ తగ్గించింది. ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను బాగా పంచుకుంటుంది.

ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఈ బ్యూటీ ఫోటోల పై ఓ లుక్కేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker