News

ఆస్పత్రిలో నడవలేని స్థితిలో బిగ్ బాస్ బ్యూటీ, వైద్యులు ఏం చెప్పారో తెలుసా..?

రాఖీ సావంత్..తీవ్ర అనారోగ్యం పాలైన ఆమెకు ఇటీవలే సర్జరీ చేశారు వైద్యులు. ఇది జరిగి సుమారు 10 రోజులవుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందామె. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినిమా ఆడియెన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ఈ నటిని మొదట గుర్తు పట్టలేకపోయారు.

అయితే తన యాక్టింగ్​తో భారీగా అభిమాన గణాన్ని సందాదించుకున్న బాలీవుడ్ నటి. సినిమాల కంటే కూడా బిగ్​బాస్ షో ద్వారానే ఆమె పాపులారిటీ పెరిగింది. నిత్యం ఏవో కామెంట్స్ చేస్తూ వివాదాల్లో ఆమె పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాంటి నటి ఇప్పుడు దీన స్థితిలో ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాఖీకి ఇటీవలే డాక్టర్లు సర్జరీ చేశారు. ఇది జరిగి దాదాపు 10 రోజులు కావొస్తోంది. ఆమె గర్భాశయంలో భారీ కణతిని గుర్తించిన వైద్యులు.. దాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు.

ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్న రాఖీ.. తాజాగా తన హెల్త్ కండీషన్ గురించి తెలియజేస్తూ భర్త రితేష్​తో కలసి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. హాస్పిటల్​లో తీసిన వీడియోను రాఖీ పంచుకుంది. ఇందులో ఆమె అడుగు వేయడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించింది. భరించలేని నొప్పితో ఆమె విలవిల్లాడటాన్ని అందులో చూడొచ్చు. నొప్పితో నడిచేందుకు ఇబ్బంది పడ్డ రాఖీకి నర్సులు సాయం చేశారు.

దీనిపై ఆమె భర్త రితేష్ రియాక్ట్ అయ్యాడు. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటుందని తెలిపాడు. తాను నడుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటందూ ఎమోషనల్ అయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్​గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. రాఖీ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె రికవర్ అయి.. మళ్లీ మునుపటి స్థాయిలో అందర్నీ ఎంటర్​టైన్ చేయాలని చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker