రామోజీ మొత్తం ఆస్తుల విలువెంతో తెలుసా..? ఇప్పుడు ఆ ఆస్తులకు వారసులెవరాంటె..?
చెరుకూరు రామోజీ రావు అసలు పేరు చెరుకూరి రామయ్య. కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించి.. దేశం గుర్తించదగ్గ స్థాయికి ఎదిగారు. రామోజీ అనే పేరును ఒక బ్రాండ్‌గా మార్చుకున్నారు. మీడియా, ఎంటర్‌టైన్మెంట్, రిటైల్, ఎడ్యుకేషన్, చిట్ ఫండ్స్ ఇలా అనేక వ్యాపార సంస్థలు స్థాపించారు. విజయంతంగా నడిపించడంతో పాటు సినిమాలనూ నిర్మించారు. అయితే 87 ఏళ్ల వయసులో మృతి చెందిన ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది.
మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా ఆవిర్భవించింది రామోజీ ఫిల్మ్ సిటీ. ఈయన జీవితం ఎంతో మంది యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకం.
ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు.. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా సిటీల్లో రామోజీరావుకు వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ లక్షల కోట్లు ఉంటుందట. హైదరాబాద్ లో దాదాపు 2వేల ఎకరాల విస్తీర్ణంలో రామోజీ ఫిలిం సిటీ ఉంది. దీని విలువ 20 వేల కోట్ల రూపాయలని అంచనా. 2021 నాటికి రామోజీరావు మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా 4.5 బిలియన్ డాలర్లు అంటే 37,583 కోట్లు అని తెలుస్తోంది. ఇకపోతే రామోజీరావుకు ఇద్దరు కుమారులు.
పెద్ద కొడుకు కిరణ్ ప్రభాకర్, చిన్న కొడుకు సుమన్ ప్రభాకర్. సుమన్ బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్ర లేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా అందరికీ సుపరిచితుడే. ఆయన 2012లో అనారోగ్యంతో చనిపోయారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు కిరణ్ ఈనాడు గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్‌గా, పెద్ద కోడలు శైలజా కిరణ్ మార్గదర్శి ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుమన్ సతీమణి విజయేశ్వరి రామోజీ ఫిలిం సిటి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూనే.. రామోజీ గ్రూప్‌కు చెందిన పలు సంస్థల బాధ్యతలు భుజాలపై వేసుకుంది.