News

యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం. అస్థికలతో బాధ పడుతూ పోస్టు చేసిన రష్మీ.

రష్మీ ప్రొఫిషినల్ కెరీర్ విషయానికి వస్తే.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా పలు షోలో, ఈవెంట్ లు చేస్తూ వస్తున్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా హీరోయిన్‌గా, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. గత ఏడాది ఆర్గానిక్ అల్లుడు హైబ్రిడ్ మామ, భోళాశంకర్, హాస్టల్ బాయ్స్ సినిమాలతో ఆడియన్స్ ని పలకరించారు. అయితే రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.

లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. తాజాగా రష్మీ ఇంట్లో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన పెట్ మరణించింది.

తన పెంపుడు కుక్కకి రష్మీ చుట్కి గౌతమ్ అని పేరు పెట్టింది. చుట్కి గౌతమ్ తన బేబీ గర్ల్ అని రష్మీ పోస్ట్ చేసింది. అయితే కారణాలు తెలియవు కానీ నేడు రష్మీ పెంపుడు కుక్క చుట్కి గౌతమ్ మరణించినట్లు పోస్ట్ చేసింది. మరణించిన కుక్కపై రష్మీ పూలమాలలు వేసిన ఫోటో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీసెంట్ గా చుట్కితో ఎంత ప్రేమగా తాను గడిపానో అనే విషయాన్ని తెలిపే ఫోటోలని కూడా రష్మీ షేర్ చేసింది.

ఈ ఫోటోలని చూస్తున్న నెటిజన్లు చుట్కి గౌతమ్ కి సంతాపం తెలుపుతున్నారు. బాధపడకండి.. చుట్కి గౌతమ్ స్వర్గంలో సంతోషంగా ఉంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker