రేవ్ పార్టీ పై సంచలన వీడియో విడుదల చేసిన ప్రముఖ నటి, అక్కడ అసలు ఏం జరిగిందంటే..?
రేవ్ పార్టీ అంటే మన బర్త్‌డే పార్టీల్లాంటిందే అనుకుంటే.. పబ్బులో కాలేసినట్లే. సామాన్యుల ఇళ్లలో పార్టీలంటే నాన్ వెజ్, మందు. అదే బాడాబాబుల ఇళ్లలో పార్టీలు అంటే రకరకాల మద్యం బ్రాండ్లు, ఫుడ్డు, దానితో పాటు అమ్మాయిలు కూడా ఉంటారనే టాక్ ఉంది. మరి రేవ్ పార్టీ అంటే అంతకు మించి. ఇక్కడ మందు, చిందుతో పాటు డ్రగ్స్, విశృంఖల శృంగారం ప్రధానం అంటున్నారు. రేవ్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఎక్సైటింగ్ అనే అర్థంలో వాడతారు. అంటే ఈ పార్టీలు కూడా అలానే ఎక్సైటింగ్ అన్నమాట.
అయితే టాలీవుడ్ ప్రముఖ యంగ్ నటి ఆషీరాయ్ కూడా ఈ పార్టీకి వెళ్లింది. పార్టీలో జరిగిన పరిణామాలపై ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. బిల్డర్, బుకీగా తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన వాసు అనే వ్యక్తి సన్ సెట్ టు సన్ రైజ్ కాన్సెప్టుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించాడు. అతడు పిలుపు మేరకు అక్కడకు వెళ్లినట్లు చెబుతుంది ఆషీ రాయ్. ‘వాసు పిలిస్తేనే అక్కడకు వెళ్లాను. నేను బర్త్ డే పార్టీ అని చెబితేనే వెళ్లాను. అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. పోలీసులు వచ్చినప్పుడు అక్కడే ఉన్నా. నేను వాసును అన్న పిలుస్తా.
అతడు పిలిస్తేనే వెళ్లాను. కొకైన్, ఇతర మత్తు పదార్ధాలు దొరకడంపై నాకు సమాచారం తెలియదు. హేమను నేను చూడలేదు. లోపల ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అక్కడ పోలీసులకు నా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను’ అని తెలిపింది. అందరి దగ్గర నుండి శాంపిల్స్ తీసుకుని వదిలేశారని తెలిపింది. అలాగే ఓ వీడియో కూడా ఇన్ స్టాలో పోస్టు చేసింది. ‘నేను బర్త్ డే పార్టీకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు నాకు తెలియదు.
దయచేసి నాకు హెల్ప్ చేయండి. నేను ఒక ఆడ పిల్లను. ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నాను’ అని వివరణ ఇచ్చింది. కాగా, ఆషీ రాయ్.. వైతరణి రాణా, లాక్ డౌన్, మిస్టరీ ఆఫ్ సారిక, కెఎస్ 100 వంటి చిత్రాల్లో నటించింది.
అది రేవ్ పార్టీ కాదు.. బర్త్‌డే పార్టీ
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024
వాసు అన్నయ్య పార్టీ అని పిలిస్తే వెళ్ళాను – ఆషి రాయ్ pic.twitter.com/jn98T3FTfI