రివర్స్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

రివర్స్ వాకింగ్ వల్ల మీ మైండ్ ఫిట్‌గా ఉండటమే కాకుండా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనసుకు, హృదయానికి రెండింటికి మంచి జరుగుతుంది. మీరు దృష్టిని పెంచుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి రివర్స్ వాకింగ్ ప్రాక్టీస్ చేయండి. మీడియా నివేదికల ప్రకారం.. రివర్స్ వాకింగ్ ఉత్తమ కార్డియో వ్యాయామం. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మీరు కండరాలను బలంగా, చురుకుగా చేయాలనుకుంటే ఈరోజు నుంచే రివర్స్‌గా నడవడం ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి.
రివర్స్ వాకింగ్ ప్రయోజనాలు.. వాకింగ్.. ఆరోగ్యానికి ఉత్తమమైన వ్యాయామం. ఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామానికి ముందు కొన్ని నిమిషాలు నడవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. అంతే కాకుండా రాత్రి భోజనం తర్వాత కొన్ని నిమిషాల వాకింగ్‌తో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీరు మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక వ్యాయామాలు చేస్తూ ఉండవచ్చు. కానీ, మీరు రివర్స్ వాకింగ్ ప్రయత్నించారా? రివర్స్ వాకింగ్‌లో అడుగులు వెనుకకు వేయడం ఉంటుంది.
చిన్నతనంలో మీరు సరదాగా, ఆటలో భాగంగా ఇలా చేసే ఉంటారు. మొదట ఆటలా అనిపించే ఈ వ్యాయామం శరీరానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాళ్ల కండరాలు బలపడతాయి. రివర్స్ వాకింగ్ రెండు కాళ్లలోని కండరాలను బలపరుస్తుంది. వెనుకకు నడవడం వల్ల కండరాలు ఎక్కువగా సాగుతాయి. అంతే కాకుండా ఈ వ్యాయామం చేసేటప్పుడు కాళ్ల నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది.
వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రివర్స్ వాకింగ్ కింది వీపుపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు ఈ వ్యాయామం చేయవచ్చు. ఏకాగ్రతతో ఉండేందుకు సహాయపడుతుంది. రివర్స్ వాకింగ్ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెనుకకు నడిచేటప్పుడు ఏకాగ్రత అవసరం. ఈ వ్యాయామం మెదడు దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.
అంతే కాకుండా శరీరంలోని మెదడు, ఇతర అవయవాలు సమన్వయంతో పనిచేస్తాయి. మోకాలిపై ఒత్తిడి ఉండదు. చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నడిచేటప్పుడు మోకాళ్లపై ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. రివర్స్‌లో నడవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు డాక్టర్‌తో చర్చించిన తర్వాత ఈ వ్యాయామం చేయవచ్చు.