News

మీరు రుద్రాక్షలను ధరిస్తున్నారా..! అయితే ఈ తప్పులు చేయవద్దు. పొరపాటున చేసారో..?

రుద్రాక్షలను లయకారుడికి ప్రతిరూపంగా భావించి వాటిని ధరిస్తారు. మహాదేవుని అనుగ్రహం పొందడానికి.. రుద్రాక్ష సమర్పిస్తే ప్రతి పని విజయవంతమవుతుంది. రుద్రాక్షను ధరించడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుందని విశ్వాసం. రుద్రాక్ష వివిధ పరిమాణాలను కలిగి ఉంటాయి. వీటి అతీంద్రియ స్వభావం కూడా భిన్నంగా ఉంటుంది. రుద్రాక్ష చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతుంది. కనుక వీటిని ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

అయితే రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. 1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. 2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. 3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. 4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు 5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు 6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. 7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

ఏక ముఖి రుద్రాక్ష బహు అరుదైనది. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, పవిత్ర భావనలు పొందుతారు, దుష్టశక్తుల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. సంఘంలో, తన చుట్టూ ఉన్నవారిమధ్య కీర్తి పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం కలగటానికి దోహదపడి ఉద్యోగ వ్యాపార లేదా సంపాదన అభివృద్ధికి స్థిరీకరణకు కలిగే దోషాలను తొలగించగలిగే శక్తిని బుద్ధిని ఇస్తుంది.

కొన్ని రకాల దీర్ఘవ్యాధులు, మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. విటమిన్‌ డి లోపం వల్ల కలిగే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. పంచముఖి రుద్రాక్ష ఆడ, మగ, పిల్లలు అందరికీ మంచిదే. అది సౌఖ్యానికి, ఆరోగ్యానికి, స్వతంత్రతకూ సర్వత్రా దోహదకారి. రుద్రాక్ష రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. నరాలకు కొంత నెమ్మదిని కలిగించి నాడీ వ్యవస్థకు కొంత స్వాంతన, చురుకుదనాన్ని కలిగిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker