News

ఈ హీరోయిన్ డాక్టర్ కూడా అని తెలుసా..? ఆ పిల్లల కోసం ఎంత సాయం చేసిందో తెలిస్తే..?

రూప.. డాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆమె మరెవరో కాదు అచ్చ తెలుగమ్మాయి రూప కొడువాయూర్. ఈమె సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, సోహెల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఈమె ఒక డాక్టర్, డ్యాన్సర్ కూడా. వృత్తిరీత్యా డాక్టర్ అయిన రూప.. సినిమాలు చేస్తూ కూడా డాక్టర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అయితే టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.

ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చినా.. రూపకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రివ్యూస్ అందుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో రూపకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆఫర్స్ అందుకుంటుంది రూప.

ప్రస్తుతం తమిళంలో నీలిరా సినిమాలో నటిస్తుంది. అలాగే ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో ప్రియదర్శి జోడిగా కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. రూప కొడువాయూర్ నటి మాత్రమే కాకుండా డాక్టర్ కూడా. అలాగే డ్యాన్సర్ కూడా. డాక్టర్ గా తన వృత్తిని కొనసాగిస్తూనే ఇటు కథానాయికగా సినిమాల్లో నటిస్తుంది. అలాగే వైద్యురాలిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తాజాగా ఓ ఊరికి వెళ్లి అక్కడ మానసిక వైకల్యం ఉన్న అమ్మాయిలకు.. అలాగే వారి తల్లిదండ్రులకు పీరియడ్స్ పై అవగాహన కల్పిస్తుంది.

అంతేకాకుండా ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. రూప మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker