Health

ఉప్పును ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుందా..? అసలు విషయం తెలిస్తే..?

ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తగిన మోతాదులోనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ ఉప్పును అధికంగా తీసుకుంటే రక్త పోటు వస్తుంది.. అధికంగా ఉండే రక్తపోటు గుండె ఆరోగ్యంపై కూడా తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉప్పులేని కూరలు, ఆహార పదార్థాలు అసలే ఉండవు. ఎందుకంటే ఉప్పుతోనే వంటల రుచి తెలుస్తుంది. అసలు ఉప్పు లేని వంటలను తినడం సాధ్యమవుతుందా చెప్పండి.

ఏదేమైనా ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది కూడా లిమిట్ లో తిన్నప్పుడే. కానీ మనలో చాలా మంది ఉప్పును మోతాదుకు మించి తినేస్తుంటారు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పును తగ్గించాలని హాస్పటల్ కు వెళ్లిన ప్రతిసారి డాక్టర్లు చెప్తూనే ఉంటారు. ఉప్పు ఉప్పు క్యాన్సర్ కు కూడా కారణమవుతుందట. రోజూ 10 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక జపనీస్ అధ్యయనం వెల్లడించింది.

దీనిని మరింత అర్థం చేసుకోవడానికి ఇటీవల ఎలుకలపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం.. కడుపులో ఎక్కువ ఉప్పు ఉండటం వల్ల కడుపు పొర మారుతుంది. అలాగే ఇధి క్యాన్సర్ కు కారణమవుతుంది. దీనిని అనుసరించి జపాన్, చైనా, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్ నుండి వచ్చిన అనేక అధ్యయనాలు ఉప్పు తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిర్ధారించాయి. నిజానికి సాధారణ ఆహారంలో 4-6 గ్రాముల ఉప్పును ఉపయోగిస్తారు.

ఎందుకంటే ఉప్పును ఎక్కువగా వేయడం వల్ల ఫుడ్ రుచి మారుతుంది. కానీ ఊరగాయలు, సాల్టెడ్ చిప్స్, సాల్టెడ్ వేరుశెనగ, ప్రాసెస్ చేసిన మాంసం వంటి కొన్ని ఆహారాలలో ఉప్పు మోతాదుకు మించి ఎక్కుగా ఉంటుంది. అంతేకాకుండా ఉప్పు రోజుకు 16 గ్రాముల వరకు పెరుగుతుంది. ఎక్కువ ఉప్పు గ్యాస్ట్రిక్ మ్యూకోసా అని పిలువబడే గ్యాస్ట్రిక్ పొరను నాశనం చేస్తుంది. దీనిని పేగు మెటాప్లాసియా అంటారు. అలాగే అధిక ఉప్పు ఉంటే కడుపులో పెరిగే బ్యాక్టీరియాలో హెలికోబాక్టర్ పైలోరి ఒకటి.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ బ్యాక్టీరియా కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఊరగాయ, ఉప్పు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినకూడదు. అలాగే రోజువారీ ఉప్పును 6 గ్రాముల కంటే తక్కువగానే తీసుకోవాలి. దీనివల్ల గుండె జబ్బులే కాదు కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker