News

ఆ విషయంలో తప్పు చేసానని ఓపెన్ గా ఒప్పుకున్న సమంత.

సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది . సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది.ఈ వెబ్‌సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత స్పై పాత్రలో కనిపిస్తారని సమాచారం. సమంత తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు.

అయితే ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. అప్పుడప్పుడూ కొటేషన్స్ పెడుతూ.. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే అభిమానులతోనూ ముచ్చటిస్తుంది సామ్. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. నెటిజన్ అడిగిన ప్రశ్నకు అవును నేను తప్పు చేశాను అని ఒప్పుకుంది సామ్.

అనేక మంచి విషయాలు మీరు బాగానే చెబుతారు. కానీ, మీరే ఆరోగ్యానికి హానికరమైన బ్రాండ్స్‌ని కూడా ప్రమోట్ చేశారు అని సామ్ ను అడిగాడు. దానికి సామ్ స్పందిస్తూ.. అవును గతంలో నేను తప్పులు చేశాను అని ఒప్పుకుంది. కానీ అవి కావాలని చేసిన తప్పులు కావు. వాటి గురించి తెలిసిన తర్వాత ఆ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ఆపేశాను అని తెలిపింది. ప్రస్తుతం తాను ఏదైతే చేస్తున్నానో వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపింది సామ్. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరోయిన్ అయ్యుండి తప్పును సమర్ధించుకోకుండా నిజాయితీగా ఒప్పుకుంది అంటూ సామ్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఇటీవలే బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. అలాగే హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుందని తెలుస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker