Health

శంఖపుష్పితో టీ చేసుకొని తాగితే బీపీ, షుగ‌ర్ త‌గ్గుతాయి, కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.

దేవుడి పూజకు మాత్రమే ఔషధ గుణాలు అధికంగా ఉంటంతో ఈ శంఖపుష్పి సాగుపై రైతులు ఫోకస్ పెట్టారు. దీని సాగు ద్వారా రైతులకు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. శంఖపుష్పిని ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో దీనిని పెద్ద పరిమాణంలో ఉపయోగిస్తున్నారు. ఒకసారి పెరగడం మొదలైన తర్వాత సంవత్సర కాలంపాటు దిగుబడిని ఇస్తుంది. శంఖపుష్పి మొక్క పువ్వులు ఎరుపు, తెలుపు, నీలం రంగులో కూడా ఉంటాయి.

దాని విత్తనాలు నలుపు రంగులో ఉంటాయి. ఇవి శంఖం గుండ్లు లాగా ఉంటాయి. అయితే మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద ప‌రంగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌లు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో శంఖుపుష్పి మొక్క కూడా ఒక‌టి. ఇది తీగ జాతికి చెందిన‌ది. దీని పుష్పాలు నీలం లేదా తెలుపు రంగులో ఉంటాయి. అయితే నీలం పుష్పాల వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ మేలు జ‌రుగుతుంది. నీలం పుష్పాల‌ను సేక‌రించి నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను ఒక క‌ప్పు చొప్పున రోజూ తాగాలి.

దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శంఖుపుష్పి పువ్వులు నీలం రంగులో ఉంటాయి. అందువ‌ల్ల ఆ పువ్వుల‌తో క‌షాయం కాస్తే అది కూడా నీలం రంగులోనే ఉంటుంది. అయితే ఆ టీ చ‌ప్ప‌గా ఉంటుంది. క‌నుక అందులో తేనె, నిమ్మ‌ర‌సం క‌ల‌ప‌వ‌చ్చు. ఇవి క‌లిపితే ఆ టీ ఊదా రంగులోకి మారిపోతుంది. ఇలా కూడా తాగ‌వ‌చ్చు. ఈ టీ ని తాగినా మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. ఇక శంఖుపుష్పి పువ్వులో యాంథో స‌య‌నిన్లు ఉంటాయి. అందుక‌నే అవి నీలం రంగులో ఉంటాయి. ఇక ఈ యాంథో స‌య‌నిన్లు యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి.

అందువ‌ల్ల గుండె జ‌బ్బులు, షుగ‌ర్ వంటి స‌మ‌స్య‌లు రావు. ఈ టీని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు రావు. ముఖ్యంగా సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ప‌ల ర‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇక ఒళ్లు నొప్పులు లేదా ఏదైనా భాగంలో నొప్పిగా ఉంటే ఈ టీని తాగితే త్వ‌ర‌గా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ టీ లో స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ టీని తాగితే త్వ‌ర‌గా నొప్పులు త‌గ్గుతాయి.

ఈ టీని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మాన‌సిక ప్ర‌శాంతత ల‌భిస్తుంది. రాత్రి పూట తాగితే మ‌న‌స్సు హాయిగా మారుతుంది. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ టీని తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారుతాయి. దీంతో ర‌క్త‌స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇలా శంఖుపుష్పి టీ తో మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక దీన్ని రోజూ తాగాల్సి ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker