శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా..? అసలు విషయమేంటంటే..?

సాధారణంగా ఎంగేజ్మెంట్ జరిగిన రెండు నెలలు లేదా మూడు నెలల్లోపే వివాహాలు జరిగిపోతూ ఉంటాయి. కానీ వీరి ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలు గడుస్తున్న ఇంకా పెళ్లిపై ఎటువంటి వార్తలు రాకపోవడంతో రకరకాల రూమర్స్ సృష్టిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోని రక్షిత రెడ్డి, శర్వానంద్ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు అని, ఇక వారు పెళ్లి చేసుకోకుండానే మరో అఖిల్ జంటలాగా కాబోతున్నారు అంటూ రకరకాల రూమర్సు స్ప్రెడ్ చేశారు.
అయితే యంగ్ హీరో శర్వానంద్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే! అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో శర్వానంద్‌కు యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు రామ్‌చరణ్, ఉపాసన, సిద్దార్థ్, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

ఇకపోతే వీరి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఐదు నెలలు కావాల్సి వస్తోంది. ఇంతవరకు వీరు పెళ్లి ఊసెత్తకపోవడంతో ఈ ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘శర్వానంద్- రక్షితల పెళ్లి ఆగిపోలేదు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారు.

శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే లండన్‌లో 40 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు. తను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేశాకే పెళ్లిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తాడు. ఇప్పుడతడు సిటీలోనే ఉన్నాడు కాబట్టి ఇరు కుటుంబాలు కలుసుకుని పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్ చేస్తారు.

ఆ పెళ్లి తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తాం’ అని హీరో టీమ్ స్పష్టతనిచ్చింది. కాగా శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాకుండా ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనుమరాలని తెలుస్తోంది.