ఎట్టకేలకు జెర్సీ నంబర్ 7 రహస్యాన్ని బయటకి చెప్పేసిన మహేంద్ర సింగ్ ధోనీ.
అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప కెప్టెన్‌గా కితాబులందుకున్న ధోనీ.. భారత్‌కు రికార్డు స్థాయిలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అతడి సారథ్యంలో టీమిండియా 2007లో పొట్టి ప్రపంచకప్ నెగ్గింది. ఆ తర్వాత స్వదేశంలో 2011 వన్డే వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. ధోనీ కెప్టెన్సీలో భారత్ 2013 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
అయితే మ్యాచ్‌లో తాను వేసుకొనే ఐకానిక్ జెర్సీ నంబర్ 7 గురించి కూడా ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో దాచేదేమీ లేదని.. జులై 7వ తేదీన తన బర్త్ డే అని, అందుకే ఆ నంబర్ టీ షర్ట్ వేసుకుంటానని అన్నాడు. ఇక, కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు ధోని.
ఆ టీమ్‌కు ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినా ఐపీఎల్లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌కూ గుడ్‌బై చెబుతాడని మూడేళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయినా ఆడటం ఆపని మాహీ.. లాస్ట్ సీజన్లో సీఎస్కేను ఛాంపియన్‌ను చేశాడు. కాలి నొప్పి ఇబ్బంది పెడుతున్నా మొండిగా ఆడాడు. టీమ్‌లో స్టార్లు లేకపోయినా ఉన్న వారిలో నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ను రాబట్టాడు.
ఈ నేపథ్యంలోనే సీఎస్కేలోకి వచ్చే ప్లేయర్లు అంతగా ఎందుకు సక్సెస్ అవుతున్నారని అతడికి ప్రశ్న ఎదురైంది. మరి.. కెప్టెన్‌గా ధోని సక్సెస్ సీక్రెట్ ఏంటని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Just Thala Dhoni being Thala Dhoni !! 😂❤️#MSDhoni #WhistlePodu #Dhoni @msdhoni
— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) February 10, 2024
🎥 via @/single.id pic.twitter.com/Y68CqES6h3