News

ఇన్‌స్టా ద్వారా మహేష్ కూతురు నెల‌కి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.

హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేని కూడా అంతే… పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడు ఏదో ఒక విష‌యాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇక త‌న‌దైన టాలెంట్‌తో కూడా మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు మహేష్. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికానుకగా విడుదలైన గుంటూరు కారం సినిమా పదిరోజుల్లోనే 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మహేష్ బాబు కూతురు సితారకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

సితార హీరోయిన్ అవ్వాలని ఆశపడుతోంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఆ విషయం చెప్పింది సితార. ఇక ఈ చిన్నారి సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా.. మాములు వల్లే ఇన్ స్టా గ్రామ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తుంటారు. ఇన్ స్టాలో సితారకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సితార యూట్యూబ్ ఛానెల్‌లోనూ 10 వేల మందికి పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో బ్రాండ్స్, ప్రమోషన్స్ లాంటివి చేస్తుంది సితార.

నెలకు ఈ అమ్మడు ఏకంగా 30లక్షల వరకు సంపాదిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది సితార. తాజాగా ఆర్ఫాన్ పిల్లలకు గుంటూరు కారం సినిమాను చూపించింది సితార.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker