Health

ఈ పండ్లు ఆరోగ్యానికి మంచివి. ఇవి తింటే షుగర్ పూర్తిగా పోతుంది.

స్కై ఫ్రూట్.. దీనిని చెక్కర బాదం అని పిలుస్తుంటారు. దీని పేరు చెక్కర బాదం అయినప్పటికీ.. తినడానికి చాలా చేదుగా ఉంటుంది. స్కై ఫ్రూట్ లేదా షుగర్ బాదం అనేక ఆగ్నేయాసియా దేశాల్లో ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది అధిక బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. చాలా చెట్లు గుబురుగా క్రిందికి వేలాడుతూ ఉంటాయి. అయితే స్కై ఫ్రూట్ ఇప్పటిది కాదు. చాలా పాత పండే. ఆగ్నేయాసియా దేశాలలో దీనిని అధికంగా తింటారు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను మన దరికి చేరకుండా కాపాడుతుంది. ఇది చూడడానికి కూడా కివీ ఫ్రూట్ లా కనిపిస్తుంది.

కానీ కివి చాలా మెత్తగా ఉంటే, ఇది గట్టిగా ఉంటుంది. దీన్ని పగలగొట్టి గింజను బయటకు తీసేయాలి. ఇది రుచికరమైన పండు కాదు. అందుకే దీన్ని తినే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీని రుచి కాస్త చేదుగా ఉంటుంది. కానీ మన శరీరానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఈ పండును తింటే ఎంతో మంచిది. చక్కెర స్థాయిలు 200 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఈ పండును తింటే చాలు, చక్కెర స్థాయిలు అమాంతం తగ్గుతాయి. దీని విత్తనాన్ని కూడా తినవచ్చు.

ఈ పండును పొడి రూపంలో మార్చుకొని తినేవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ పండును తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మలబద్ధకం వంటి సమస్యలు రావు. చర్మ ఎలర్జీలకు ఇది మంచి చికిత్స చేస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఆస్తమా ఉన్నవారు ఈ పండును తింటే ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది ముందుంటుంది.

కాబట్టి ఎలాంటి గుండె సమస్యలు రావు. రక్తనాళాలు మూసుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. కాబట్టి కరోనరీ వ్యాధులు వంటివి రాకుండా ఉంటాయి. మహిళలు రుతుస్రావం సమయంలో అధికంగా కడుపునొప్పిని అనుభవిస్తుంటే, ఈ పండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే పిసిఒడి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పండును తరచూ తింటే దాని లక్షణాలు తగ్గుతాయి.

అయితే ఈ పండును చాలా మితంగానే తినాలి. ఎందుకంటే అధికంగా తింటే కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ పండు తిన్నాక వికారంగా అనిపించినా, ఆకలి వేయకపోయినా, మూత్రం రంగు మారినా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ఉత్తమం. కళ్ళల్లోని తెలుపు రంగు కాస్త పసుపు రంగులోకి మారినా, చర్మం పసుపు రంగులోకి మారినా… వెంటనే ఈ పండును తినడం మానేయాలి. వైద్యులను సంప్రదించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker