Health

కొంతమందికి నిద్రలోనే కార్టియాక్ అరెస్టు వస్తుంది. వాళ్ళు నిద్రలోనే చేనిపోవాల్సిందేనా..?

కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు రెండూ ఒకటి కాదు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. మరోవైపు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది రక్త ప్రసరణకు అడ్డుపడటం వల్ల కాదు. గుండె విద్యుత్ చర్యలో మార్పు జరిగి గుండె లయ తప్పినపుడు కలుగుతుంది. అయినప్పటికీ, గుండెపోటు కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు. అయితే కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా కొన్ని రకాల గుండె వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇవి జన్యుపరమైనవి.

ఇలాంటి వారిలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ నిద్రలో వచ్చే అవకాశం ఉంది. అలాగే పుట్టుకతో వచ్చే గుండె లోపాలు లేదా గుండె నిర్మాణంలో అసాధారణతలు కూడా నిద్రలో ఉన్నప్పుడు గుండెకు చెందిన విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. దీనివల్ల కూడా కార్డియాక్ అరెస్టు వచ్చే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం సక్రమంగా లేనప్పుడు అంటే గుండెలయ అదుపు తప్పినప్పుడు ఇలాంటి ఆకస్మిక కార్డియాక్ అరెస్టుకు దారి తీయవచ్చు. కార్డియాక్ అరెస్టు అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వస్తుంది.

ఇది సాధారణంగా గుండె కండరానికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉంది. దీనికి వెంటనే చికిత్స అవసరం. సీపీఆర్ వంటివి చేస్తే ప్రాణం నిలిచే అవకాశం ఉంది. కానీ నిద్రలో కార్డియాక్ అరెస్టు వస్తే మాత్రం తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రాణం నిలిచే అవకాశం లేదు. కొన్ని అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా ఇలా నిద్రలోనే గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. ఊబకాయం, మధుమేహం వంటివి గుండెకు చేటు చేస్తాయి.

ఇవన్నీ కూడా గుండె సమస్యను పెంచుతాయి. అందుకే ప్రతి ఏడాది గుండెను చెక్ చేయించుకోవడం చాలా అవసరం. గుండె పనితీరు ఎలా ఉందో, గుండె ఆకారం ఎలా ఉందో వైద్యుల చేత ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా కూడా గుండెను కాపాడుకోవచ్చు. సమతుల్య ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవాలి. శారీరకంగా చురుగ్గా ఉండాలి. రోజూ వాకింగ్ చేయాలి. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం చాలా అవసరం.

అలాగే ఛాతీ నొప్పి రావడం, గుండెల్లో దడ, తల తిరగడం, మూర్ఛ వంటివి గుండె ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలుగా భావించాలి. ఇలాంటివి కనిపిస్తే తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రత్యేకించి కుటుంబ చరిత్రలో గుండె సంబంధించిన అనారోగ్యాలతో ఉన్న వారి వారసులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో జన్యు పరీక్షలు వారసత్వంగా వచ్చిన గుండె జబ్బులను నిర్ణయించడానికి సహాయపడతాయి. కాబట్టి అలాంటి జన్యు పరీక్షలను కూడా నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే గుండెకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker