Health

నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా..? నిపుణులు తెలిపిన కీలక వివరాలు మీకోసం.

నేలపై పడుకోవడం కష్టంగానే ఉన్నా సరే మీ ఆరోగ్యం కోసం కింద పడుకోండి అంటున్నారు నిపుణులు. పూర్వీకులు అంతా నేలపై పడుకోవడం వల్లనే ఆరోగ్యంగా ఉండేవారని చెప్తున్నారు. పరుపులనేవి తర్వాతి కాలంలో మానవ సౌకర్యార్థం వచ్చాయి తప్పా వాటి కంటే నేలపై పడుకోవడంలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అయితే రోజంతా విపరీతంగా కష్టపడటం ద్వారా అలసిపోతుంటారు. అలా తీవ్ర అలసటతో ఇంటికి వచ్చి మెత్తటి బెడ్‌పై పడుకుంటే ఒక రకమైన హాయి కలుగుతుంది. ఈ విషయంలో అస్సలు రాజీపడరు.

ఇంకా ప్రజలు తమ సౌకర్యానికి అనుగుణంగా పడకలను సిద్ధం చేసుకుంటారు. కొందరు పలుచని పరుపులపై పడుకోవడానికి ఇష్టపడితే.. మరికొందరు మందపాటి పరుపులపై పడుకోవడానికి ఇష్టపడుతారు. కొద్దిమంది మాత్రం నేలపై పడుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే, బెడ్, పరుపుపై పడుకోవడం కంటే.. నేలపై పడుకోవడం ద్వారానే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రశాంతమైన నిద్రతో పాటు.. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెబుతున్నారు. వెన్నెముక సమస్యలు తొలగిపోతాయి..

గంటల తరబడి కుర్చీల్లో కూర్చుని, నిల్చుని పని చేయడం కారణంగా చాలా మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతారు. ఖరీదైన మందులను జీవితాంతం వినియోగిస్తుంటారు. అయితే, అలస కారణంతో పరుపుపై పడుకోవడం వలన వెన్నెముక సమస్యలు మరింత తీవ్రం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. నేలపై పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేలపై పడుకోవడం వలన వెన్నెముకకు బలం చేకూరి.. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు.

రక్త ప్రసరణ పెరుగుతుంది.. శరీరంలో సరైన రక్త ప్రసరణ లేకపోవడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తప్రసరణ లేమి వల్ల కండరాలు బలహీనం అవుతాయి. ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నేలపై నిద్రించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలలో నొప్పి కూడా తగ్గుతుంది. అందుకే రోజూ నేలపై పడుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఒకసారి అలవాటు అయితే మంచి ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఒత్తిడి నుంచి ఉపశమనం.. కొంతమంది ఖరీదైన పరుపులపై పడుకున్నప్పటికీ.. ఎక్కువ సేపు నిద్రపోలేరు. ఇది వెన్నెముక సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడికి దారితీస్తుంది. ఈ ఒత్తిడి మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంపది. ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే నేలపై పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నేలపై పడుకోవడం వలన హాయిగా నిద్రపడుతుందని చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker