నిద్రలో మెడ పట్టేసిందా..? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందుతారు.

కొంతమంది ఉదయాన్నే నిద్ర లేవగానే మెడ నొప్పులతో ఇబ్బంది పడుతారు. దీని కారణంగా వారు తమ మెడను సరిగ్గా వంచలేరు కదిలించలేరు. ఇది కాకుండా కొంతమంది తలనొప్పి సమస్యను కూడా అనుభవిస్తారు. దీంతో వారు రోజు మొత్తం డిస్ట్రబ్‌గా ఉంటారు. దీనికి కారణం వారు సరైన మార్గంలో నిద్రించకపోవడమే. అంతేకాదు దిండును తప్పుగా ఉపయోగించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.
అయితే చాలా మందికి నిద్రపోతున్నప్పుడు మెడ పట్టేయడం జరుగుతుంది. ఫలితంగా నిద్ర లేచిన తర్వాత తమ తలను పక్కకు కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. కొంచెం కదిపినా నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. ఫలితంగా రోజంతా కూడా ఏ పనిచేయలేక ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ సమస్య ఎప్పటికీ తగ్గుతుందంటే ఎవరూ చెప్పలేరు.

ఈ క్రమంలోనే మెడ పట్టేయడం వల్ల వచ్చే నొప్పులను భరించలేక పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు కొందరు. అయితే కొన్ని చిట్కాలను అనుసరిస్తే ఎంతటి మెడ నొప్పి నుంచి అయినా తక్షణ ఉపశమనం పొందవచ్చు. హీట్ ప్యాక్.. నిద్రలో మెడ పట్టేసినప్పుడు తలను గట్టిగా తిప్పే ప్రయత్నం చేయకూడదు.

అలా చేస్తే నొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇంకా అలాంటి సందర్భంలో మీరు చేయవలసిన పని హీట్ ప్యాక్ లేదా వేడికాపడం. ఇలా చేయడం వల్ల మెడ నొప్పి తొలగిపోతుంది. ఐస్ ప్యాక్.. మెడ పట్టేసినప్పుడు ఉపశమనం కోసం మీరు కోల్డ్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ కూడా మెడపై పెట్టుకోవచ్చు.

అందుకోసం మీరు కొన్ని ఐస్ ముక్కలను టవల్లో చుట్టి కాపడంలా మెడపై కొద్ది సమయం వరకు రుద్దుతూ ఉండాలి. ఇలా నొప్పి ఉన్న ప్రతిచోట కూడా పెట్టుకోవచ్చు. మసాజ్.. మెడ పట్టేసినప్పుడు నొప్పిగా ఉన్న ప్రదేశంలో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలాంట సందర్భంలో మీరు మసాజ్ కోసం ఆవాల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు.