Health

నిద్ర మాత్రలు వేసుకుంటేనే నిద్ర వస్తుందా..? అయితే మీరు తొందలోనే..?

కొంతమంది నిద్ర మాత్రలు వాడుతూ ఉన్నప్పుడు అవి అలవాటు అయ్యిపోయి నిద్ర మాత్రలు వేసుకుంటేనే నిద్ర వచ్చే పరిస్థితికి దారితీస్తుంది.నిద్ర మాత్రలు ఆరోగ్యానికి అసలు మంచివి కావు.వాటిని వేసుకోవటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.మంచి ఆరోగ్యానికి రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. నిద్ర లేకుంటే.. శరీరంపై ప్రభావం పడుతుంది. కానీ అందరికీ సులభంగా నిద్ర అనేది రాదు. నిద్ర అనగానే కొందరికి అనేక సమస్యలు వస్తాయి. కొందరు నిద్రించడానికి మెడిసిన్ తీసుకుంటారు.

స్లీపింగ్ పిల్స్ ప్రాథమికంగా మెదడుపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా నెమ్మదిగా నిద్రపోవడానికి మీకు సహాయపడతాయి. ఈ రకమైన మెడిసిన్ డాక్టర్ సలహాపై తీసుకోవచ్చు. కానీ రోజూ నిద్రమాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. నిద్రమాత్రలు తప్పు సమయంలో తీసుకుంటే, అది మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. ముందు రోజు రాత్రి నిద్ర మాత్రలు వేసుకుని సరిగ్గా నిద్రపోకపోతే, ఆ ప్రభావం మరుసటి రోజు వరకు ఉంటుంది.

మందు తాగిన తర్వాత మరుసటి రోజు ఉదయం మగతగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా అయితే ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు నిద్రమాత్రలు క్రమం తప్పకుండా వాడటం వల్ల వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. మూడ్ స్వింగ్స్, చికాకు కలిగించే మానసిక స్థితి మొదలైనవి వివిధ లక్షణాలను కలిగిస్తాయి. నిద్ర మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, శరీరం ఆ రకమైన మందులకు అలవాటుపడుతుంది.

కొంతకాలం తర్వాత ఔషధం శరీరంలో పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మెడిసిన్ డోస్ పెంచాలి. ఇది చాలా కాలం పాటు కొనసాగితే, ఇది శరీరానికి నిజంగా భయంకరంగా మారుతుంది. ప్రాణాలకే ప్రమాదం. చాలా కాలం పాటు నిద్ర మాత్రలు క్రమం తప్పకుండా తీసుకుంటే, అది శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం పడుతుంది. శరీర వ్యర్థాలు కూడా శరీరాన్ని విడిచిపెట్టవు. ఫలితంగా ఇది దీర్ఘకాలంలో శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

నిద్ర మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మత్తుపదార్థాలకు వ్యసనం ఏర్పడుతుంది. మెడిసిన్ లేకుండా నిద్ర రాకుండా అయిపోతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్రమాత్రలు తీసుకోవడం మంచిది కాదు. అధిక నిద్ర మాత్రలు మరణానికి కారణమవుతాయి. కొన్నిసార్లు నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పక్షవాతం, కోమా, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రమాత్రల వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక రుగ్మతలు కూడా వస్తాయి. కోపం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker