Health

చిన్నతనంలోనే తెల్లజుట్టు వచ్చిందా..? మళ్ళీ నల్లగా మారాలంటే..?

కొబ్బరినూనెలో నిమ్మరసం కలపి ప్రతిరోజు ఈ రసం తలకు రాసుకుంటే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. అదేవిధంగా తెల్లజుట్టు రాకుండా ఉంటుంది. ఉసిరి పొడి చేసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్టు మాదిరిగా చేసుకోవాలి. దానిని ప్రతిరోజు తలకు రాసుకుని రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అయితే ఇరవైలు, ముప్ఫైల వయసులోనే కొందరికి తెల్లజుట్టు వచ్చేస్తుంటుంది. దీని వల్ల చిన్నతనంలోనే ఎక్కువ వయసు ఉన్న వారిలా కనిపిస్తుంటారు.

ఈ మధ్య కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. జన్యు పరమైన కారణాలు, ఒత్తిడి, ధూమపానం, విటమిన్‌ లోపం, ఎక్కువగా అతి నీలలోహిత కిరణాలకు గురికావడం లాంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. పుట్టగొడుగులు..మన శరీరంలో మెలనిన్‌ అనే వర్ణ ద్రవ్యం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల నల్ల జుట్టు కాస్తా తెల్లగా మారుతుంది. పుట్టగొడుగుల్లో కాపర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది మెలనిన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో తెల్లగా మారుతున్న జుట్టు మళ్లీ నల్లగా మారడం మొదలవుతుంది.

ఊరబెట్టిన ఆహారాలు..ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు మనం పచ్చడి ముక్కలను ముందు ఊరబెడతాం. ఇలా ఊరబెట్టిన పదార్థాలు, ఫర్మెంట్‌ అయిన దోశపిండి, ఇడ్లీ పిండి లాంటి వాటి వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. అందువల్ల శరీరంలో బయోటిన్‌ స్థాయిలు పెరుగుతాయి. ఇది పెరిగితే జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్లు, సోయాబీన్స్‌..ఈ రెండింటిలోనూ ప్రొటీన్‌లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్‌ బీ 12 పుష్కలంగా ఉంటుంది.

చిన్న వయసులో జుట్టు తెల్లబడిపోవడం నుంచి ఇది రక్షిస్తుంది. జుట్టు నల్లగా మారాలనుకున్న వారు గుడ్డు తెల్ల సొన ఒక్కదాన్నే తినకుండా మొత్తంగా తినండి. పాల ఉత్పత్తులు..పాలు, పెరుగు, చీజ్, పనీర్‌ లాంటి వాటిలో విటమిన్‌ బీ12, కాల్షియం, ప్రొటీన్లు బాగా ఉంటాయి. ముఖ్యంగా పెరుగులో ప్రోబయోటిక్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో మెలనిన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. డార్క్‌ చాక్లెట్‌.. దీనిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.

ఇవి మన శరీరంలో తెల్ల జుట్టుకు కారణమై, పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు తోసివేస్తాయి. ఇంకా దీనిలో కాపర్‌ ఎక్కువగా ఉండటం వల్ల అది మనలో మెలనిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీని వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ ఆహారాలను తీసుకోవడంతోపాటు ధూమపానం, ఎక్కువగా అతినీల లోహిత కిరణాల బారిన పడటం లాంటి వాటిని తగ్గించుకోవాలి. ఆరోగ్యమైన జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker