Health

ఈ చిన్నపని చేస్తే చాలు, మీరు జీవితంలో సిగరెట్ జోలికి పోరు.

సిగరెట్లు ఎక్కువగా తాగే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సిగరెట్ తాగే అలవాటును దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజూ తాగే సిగరెట్ల సంఖ్యను క్రమంగా తగ్గించుకోవాలి. నికోటిన్ ప్రత్యామ్నాయంగా ఉండే ఉత్పత్తులను తీసుకొని క్రమంగా పొగ తాగడం మానేయవచ్చు. అయితే సిగరెట్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదనీ తెలుసు. కానీ ఎలా మానేయాలో తెలీదు. మానేస్తో ఏమవుతుందో అనే ఆలోచనలు.

వీటన్నింటి వల్ల మన ఆరోగ్యానికి జరుగుతున్న హానేంటో తెలిసినా అలవాటు మానేసుకోవడం కష్టమవుతుంది. సిగరెట్ తాగడం అనుకోకుండా చేసుకున్న అలవాటు, తప్పనిసరి కాదు. ఏ అలవాటైనా మార్చుకోవడానికి మార్గం ఉంటుంది. నికోటిన్ రిప్లేస్‌మెంట్.. నికోటిన్ ప్యాచులు, నాజల్ స్ప్రే, ఇన్హేలర్, నికోటిన్ గమ్స్ ఇలా చాలా ప్రత్యామ్నాలున్నాయి. మొహమాట పడకుండా ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి. మీకు సూటయ్యే మార్గాన్ని సూచిస్తారు. దానివల్ల సిగరెట్ తాగాలనే ఆలోచన తగ్గిపోతుంది. చోటు..మీరు తరచూ ఎక్కడైతే స్మోకింగ్ చేస్తారో ఆ ప్రదేశాలకు, కారణాలకు దూరంగా ఉండాలి.

లేదా కొంతమందికి టీ, కాఫీ తాగక ముందో తరువాతో స్మోకింగ్ చేసే అలవాటంటుంది, లేదా ఇంకొంతమందికి ఆల్కహాల్ తీసుకున్నాక, కొందరికి ఇంట్లో ఏవైనా గొడవలైతే దమ్ము కొట్టాలనిపిస్తుంది. అలాంటపుడు ముందు ఆ పానీయాలకు దూరంగా ఉండండి. స్మోకింగ్ గుర్తుకొచ్చే పనులు చేయకండి. కొందరు ఫోన్ మాట్లాడుతూ స్మోక్ చేస్తారు. అప్పుడు చేతిలో ఒక పెన్ పేపర్ పట్టుకుని ఏదైనా రాస్తూ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఆ ఆలోచన రాదు. వాయిదా..దమ్ము కొట్టాలనిపించినపుడు వెంటనే కాకుండా ఒక పదినిమిషాలు ఆగాలి అనుకోండి. ఆలోపు ఏదైనా పని మొదలు పెట్టండి.

అందరూ ఉన్న చోటికి వెళ్లి కూర్చోండి. ఇలా చేయడం వల్ల కాస్త పొగతాగాలనే ఆలోచన తగ్గొచ్చు. నమలడం..బబుల్ గమ్, క్యాండీ, ఏదైనా మీకిష్టమైన కూరగాయలు, క్యారట్, డ్రైఫ్రూట్స్, విత్తనాలు ఇలా ఏవైనా తినొచ్చు. దీనివల్ల కాస్త కోరిక తగ్గుతుంది. ఒక్కటే కదా..ఈ రోజుకు ఇదొక్కటే చివరిదంటూ అలవాటు కొనసాగిస్తారు. ఒక్కటైనా సరే దానివల్ల అలవాటు పెరుగుతుంది కానీ తగ్గదు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నట్లు. ఒక్కదాంతో మొదలు పెట్టి అక్కడితో ఆగిపోరు. అందుకే ఒక్కటే కదా అనే ఆలోచన జోలికి వెళ్లకండి. వ్యాయామం.. శారీరక కసరత్తులు పొగ తాగాలనే ఆలోచన మర్చిపోయేలా చేస్తాయి.

మీరెక్కువగా ఏ సమయంలో స్మోకింగ్ చేయడానికి అలవాటు పడితే.. అప్పుడు వ్యాయామం, రన్నింగ్, వాకింగ్ లాంటివి అలవాటు చేసుకోండి. క్రమంగా అలవాటు మానుకోడానికి ఇది సహాయం చేస్తుంది. వీటితో పాటే..వీలైనన్ని ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకోండి. పంచదార, కెఫిన్‌కు దూరంగా ఉండండి. యోగా, మెడిటేషన్ అలవాటు చేసుకోండి. ఒత్తిడి వల్ల స్మోకింగ్ అలవాటయితే.. దాన్ని తగ్గించుకోడానికి ఎక్సర్‌సైజ్ చేయండి. వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగండి. బాగా నిద్రపోండి. వీటివల్ల మీకు ఆరోగ్యం మీద అవగాహన పెరుగుతుంది. స్మోకింగ్ చేయాలనే ఆలోచన నుంచి బయట పడతారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker