Health

మీరు రోజుకు 10 సిగరెట్లు తాగుతున్నారా..? మీరు సంసారానికి పనికిరారు.

చాలా మంది సిగరేట్లకు బానిసవుతున్నారు. మీరు రోజుకు 10 సిగరెట్లు తాగుతున్నారా ? అయితే ఈ అలవాటు మిమ్మల్ని వేగంగా మరణానికి నెట్టివేస్తోందని తెలుసుకోండి. సిగరెట్ వ్యసనాన్ని విడిచిపెట్టడం అంత సులభం కాదు.. కానీ అధిక వినియోగం మిమ్మల్ని అకాల అనారోగ్యానికి గురి చేస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌సీఐ) ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 10 కంటే ఎక్కువ సిగరెట్లను తాగినట్లయితే మరణానికి చేరువలో ఉన్నట్లేనని ఎన్‌సీఐ పేర్కొంది. రోజుకు ఎక్కువ మొత్తంలో సిగరెట్లు తాగినట్లయితే ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

అయితే దూమపానం అలవాటు వల్ల క్యాన్సర్ వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం దేశంలో సుమారు 10 లక్షల మంది సిగరెట్ తాగడం వల్ల చనిపోతున్నారని భారత ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో… గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (2016-17) ప్రకారం భారతదేశంలో సిగరెట్ తాగేవారి సంఖ్య 10 కోట్లకు పైగా ఉందని తేలింది. ఆ సంగతి అలా ఉంటే.. ఇంతకాలం సిగరెట్ స్మోకింగ్ వల్ల శ్వాసకోస సంబంధ వ్యాదులు, క్యాన్సర్, గుండెపోటు వంటి వ్యాదులు వస్తాయని వినిపించిన క్రమంలో తాజాగా మరో విషయం తెరపైకి వచ్చింది.

దీని ప్రకారం… సిగరెట్ తాగడం కారణంగా ప్రజలు నపుంసకులుగా మారుస్తున్నాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అవును… సిగరెట్ తాగడం వల్ల సంసారానికి పనికిరారని, నపుంసకులుగా మారుతున్నారని చెబుతున్నారు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా ఆసుపత్రి శ్వాసకోశ వైద్య నిపుణుడు డాక్టర్ డీఎస్ గుప్తా. సిగరెట్ తాగడం వల్ల నపుంసకత్వంతోపాటు ప్రజలు గుండె జబ్బులు, కడుపులో అల్సర్లు, రక్త సంబంద వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు.

ఇదే సమయంలో… ఈ సిగరెట్ తాగే అలవాటు ఉండటం వల్ల క్రమంగా పురుషుల్లోని వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందని.. అదే మహిళలు సిగరెట్లు తాగితే వారు గర్భం ధరించడానికి కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెపుతున్నారు. తాజా పరిశోధన ప్రకారం.. సిగరెట్లు తాగేవారికి నపుంసకత్వం వచ్చే అవకాశం 85 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయాలపై మరింత స్పందించిన డాక్టర్ గుప్తా… సిగరెట్లు తాగే వ్యక్తిలో పలు రకాల మార్పులు ఉన్నాయని, శరీరం చెడు ప్రభావాన్ని చూపడం ప్రారంభించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ధూమపానం చేసే వ్యక్తికి అవసరానికి మించి కఫం రావడం ప్రారంభమవుతుందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే సిఓపిడి అనే వ్యాధికి గురవుతున్నారని తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker