Health

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఒక్క పాము కూడా మీ ఇంట్లోకి రావు, మీరు సురక్షితం.

కింగ్ కోబ్రా కాటుకు గురైన అరగంటలో ఎవరైనా చనిపోవచ్చు భారతదేశంలో మరణానికి అత్యంత సాధారణ కారణం కింగ్ కోబ్రా కాటు కింగ్ కోబ్రా శరీరం కార్డియోటాక్సిన్, సినోప్టిక్ న్యూరోటాక్సిన్‌లను కలిగి ఉంటుంది. నాగుపాము కాటు తర్వాత, శరీరం చాలా ముఖ్యమైన ప్రక్రియ న్యూరో సిస్టంపై కింగ్ కోబ్రా చాలా సీరియస్‌గా ప్రభావితం చూపుతుంది. అది చూడగానే వెళ్లి కాటేస్తుంది. అయితే పాములంటే అందరికీ హడలే.. ఎందుకంటే.. కొన్ని పాములు కాటు వేస్తే క్షణాల్లో ప్రాణాలు కొల్పోవాల్సి వస్తుంది. అన్ని రకాల పాములు విష సర్పాలు కాకపోయినప్పటికీ.. పాములంటేనే చాలా మంది ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. అంత దూరంలో పాము ఉందని తెలిసినా.. అక్కడ్నుంచి వెంటనే పారిపోయేందుకు ప్రయత్నిస్తారు.

అయితే, వర్షాకాలం వచ్చిందంటే పాములు బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. గ్రామాలు, శివారు ప్రాంతాలు, కాల్వలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పాముల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. పాములు ఇంట్లోకి ప్రవేశిస్తే వాటిని పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. లేకుంటే ఎప్పుడు ఎక్కడ పాము వచ్చి కాటేస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సివస్తుంది. అయితే ఇలాంటి మొక్కలను మీ ఇంటి ఆవరణలో లేదా పెరట్లో పెంచుకుంటే పాములు మీ ఇంటి దగ్గరకు రావు అంటున్నారు సరీసృపాల శాస్త్ర నిపుణులు.

తులసి మొక్క:- తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క. తులసి మొక్కను పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయని పురాతన కాల నుంచి వస్తున్న నమ్మకం కూడా ఉంది. చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే.. మీ పెరట్లో లేదా ఇంటి ఆవరణలో తులసి మొక్కలు ఉంటే అవి వెదజల్లుతున్న ఘాటైన వాసన పాములను మీ ఇంటికి దూరంగా ఉంచుతుంది. బ్రహ్మజెముడు:- నాగజెముడు మొక్కలు: పాములు బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి మొక్కలకు దూరంగా ఉంటాయి. బ్రహ్మజెముడు, నాగజెముడు మొక్కల ఆకులు, కాండం ముళ్ళు కలిగి ఉంటాయి, కాబట్టి పాములు వాటికి హాని కలుగుతుందనేభయంతో పారిపోతాయి.

హోలీ ట్రీ:- హోలీ ట్రీ ఆకులు ముళ్లలాంటి అంచులను కలిగి ఉంటాయి. కాబట్టి పాములు వాటి దగ్గరికి వెళ్తే గాయపడతాయని భయంతో దూరంగా పారిపోతాయి. గోధుమ గడ్డి :- ఈ రోజుల్లో అనేక మందికి గోధుమ గడ్డి గురించి చాలా అవగాహన ఉంది. గోధుమ గడ్డి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గోధుమ గడ్డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. అయితే ఇది పాములను దూరంగా ఉంచే, పాములను నివారించే సాధనంగా కూడా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. గోధుమ గడ్డి నుండి వచ్చే ఒక రకమైన ఆమ్ల వాసన పాములను ఆ ప్రాంతం నుండి దూరంగా ఉంచుతుంది.

బంతి పువ్వు:- బంతి పువ్వులు పాము వికర్షకాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. బంతి పూల మొక్కల నుంచి ఒక రకమైన ఘాటైన వాసన వెలువడుతుంది. ఆ వాసన పాములను దూరం చేస్తుంది. మచ్చిపత్రి మొక్కలు:- మచ్చిపత్రి మొక్క ఆకుల నుండి వెలువడే ఘాటైన వాసన పాములు ఇంట్లోకి రాకుండా చేస్తుంది. ఉల్లిపాయ – వెల్లుల్లి:- ఉల్లిపాయలు, వెల్లుల్లి ఆరోగ్యానికి మాత్రమే కాదు, వాటి ఘాటైన వాసన పాములను తరిమికొడుతుంది. పింక్ అగపంథస్ మొక్కలు:- పింక్ అగపంథస్ మొక్కలు కూడా ఉల్లిపాయ జాతికి చెందిన మొక్కలు. పింక్ అగాపంథస్ మొక్కలు కూడా ఉల్లిపాయల మాదిరిగానే ఘాటైన వాసనను వెదజల్లుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker