News

శ్రీలీల డిమాండ్ మామూలుగా లేదుగా..! నిమిషానికి ఎంతో తెలుసా..?

శ్రీ లీల, శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, గౌరీ రోనాంకి దర్శకత్వంలో, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు, ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సమకూర్చిన సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

అయితే శ్రీ లీల మొదటి సినిమా కు కేవలం ఐదు లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ అందుకున్న ఆమె, ప్రస్తుతం ఎంత రెమ్యునరేషన్ ఇస్తామన్న కానీ డేట్స్ సర్దుబాటు చేయలేని స్థాయికి చేరుకుంది. ఆమె నటించిన ధమాకా సినిమాకు 50 లక్షలు కోడ్ చేసిన శ్రీ లీల. రామ్ హీరోగా తెరకెక్కిన స్కంద సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేసింది. బహుశా ఆమె తక్కువ కోటిలో చేసిన సినిమా ఇదే కావచ్చు.

ఆ తర్వాత సినిమాలకు తన రెమ్యునరేషన్ ఏకంగా మూడు కోట్లకు పెంచింది ఈ భామ. ఈ క్రమంలో దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన సినిమాలు రాబోయే ఆరు నెలల కాలంలో నెలకు ఒక్కో సినిమా చొప్పున విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆరు సినిమాల తర్వాత ఆమె రెమ్యూనరేషన్ 5 కోట్లకు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న కొత్త సినిమాలో శ్రీ లీల డేట్స్ కోసం ట్రై చేసినా దొరకలేదు, దీనితో భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాణ సంస్థ సిద్ధపడిన కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. దాదాపు 7 కోట్లు ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క శ్రీ లీల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఆమె మాల్ ఓపెనింగ్ కి వస్తే అక్కడ పది నిమిషాల కంటే ఎక్కువ ఉండదు.

కానీ ఆమె రెమ్యూనరేషన్ మాత్రం దాదాపు కోటి రూపాయలు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే నిమిషానికి పది లక్షలు తీసుకుంటున్నట్లు అర్ధం అవుతుంది. పైగా ఆమె రానుపోను ఖర్చులు , హోటల్ ఖర్చులు, ఆమె స్టాఫ్ అయ్యే ఖర్చులు అదనం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ని చక్కగా పాటిస్తుంది శ్రీ లీల .

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker