సినిమా అవకాశాలు కోసం శ్రీలీల చేసిన పనులు చూస్తే కన్నీళ్లు వస్తాయి.

శ్రీలీల వరుసగా ఆఫర్లు పట్టేసుకుంటోంది. ఇప్పటికే ఆమె డైరీలో డేట్స్ ఖాళీగా లేవని టాక్. రానున్న రెండేళ్లకు సరిపడా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. స్టార్ హీరోలంతా కూడా ఆమెనే ఎంచుకుంటున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలంతా కూడా శ్రీలీలకే ఓటేస్తున్నారు. అలా శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే అప్పట్లో సమంత కేవలం రెండు సినిమాల ద్వారానే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిందని అందరూ అంటూ ఉంటారు.
ఆమె తర్వాత అదే రేంజ్ స్పీడ్ తో స్టార్ స్టేటస్ కి చేరుకున్న మరో హీరోయిన్ శ్రీలీల.పెళ్ళిసందడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా శ్రీలీల, ఆ తర్వాత రవితేజ తో చేసిన ‘ధమాకా’ చిత్రం తో ఇండస్ట్రీ మొత్తం ఆమె ఇంటి ముందు క్యూ కట్టేలాగా చేసింది. ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు వరకు పూజ హెగ్డే మరియు రష్మిక డిమాండ్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు.
ఇప్పుడు ఈమె ఎంట్రీ తో వాళ్ళిద్దరికీ సినిమాల్లో అవకాశాలే లేకుండా పోయింది. ఈ రేంజ్ డామినేషన్ ఇంత తక్కువ సమయం లో రీసెంట్ గా శ్రీలీల విషయం లోనే చూస్తున్నాము. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు బాలయ్య సినిమాతో పాటు నితిన్ , విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని మరియు పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలు కూడా ఉన్నాయి.
ఇంత తక్కువ సమయం లో స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరోల వరకు ఈ అమ్మడు డిమాండ్ ఈ రేంజ్ లో పెరగడానికి వెనుక ఆమె కృషి ఎంతో ఉంది. చిన్నతనం నుండి శ్రీలీల కి నటన అంటే పిచ్చి, మరో పక్క చదువు అంటే కూడా ఆసక్తి ఎక్కువ. స్పోర్ట్స్ మరియు డ్యాన్స్ లో మీద అమితాసక్తి. అందుకే ఈమె బాల్యం లో ఎక్కువగా వీటి మీదనే శ్రద్ద పెట్టి మిగతా పిల్లలు లాగ బాల్య జీవితాన్ని ఎంజాయ్ చెయ్యలేకపోయిందట.
అందుకే చిన్నతనం లో ఆమె తన తల్లీతండ్రులతో ఎక్కువ సమయం గడపలేకపోయిందట, అలా తన లక్ష్య సాధన కోసం బాల్యం మొత్తాన్ని త్యాగం చేసిందని అంటుంటారు శ్రీలీల సన్నిహితులు.