News

పండగ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో భార్య.

ధృవ సర్జా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ధృవ సర్జా-ప్రేరణ శంకర్ దంపతులకు వినాయక చవితి పండగ రోజే రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ప్రేరణ శంకర్ పండగ రోజే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సర్జా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. నార్మల్ డెలివరీ అయ్యిందని, మరోసారి ఆడబిడ్డ పుట్టిందని తెలిపాడు. అయితే కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా రెండోసారి తండ్రయ్యాడు.

ధ్రువ భార్య ప్రేరణ సోమవారం నాడు అంటే వినాయక చవితి రోజునే ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2019 లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ముందుగా 2022 అక్టోబర్‌లో ఓ ఆడపిల్ల జన్మించారు. ఇక ధ్రువ భార్య రెండవ సారి తల్లి కాగా ఇప్పుడు మగబిడ్డ జన్మించడంతో ధ్రువ సర్జా కుటుంబంలో సంతోషం నెలకొంది. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రేరణ ప్రసవం జరిగిందని, ఇప్పుడు తాను రెండో సారి తండ్రైన విషయాన్ని ధ్రువ సర్జానే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

‘సాధారణ ప్రసవం జరిగింది. బేబీ పుట్టింది’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో సర్జా వెల్లడించారు. ఇక ఈ క్రమ్మలో కన్నడ సినీ ప్రముఖులు, నెటిజన్లు సర్జా కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజానికి ఈమధ్యనే ప్రేరణ సీమంతం వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ధ్రువ సర్జా. దివంగతుడైన తన అన్న చిరంజీవి సర్జా సమాధి దగ్గర భార్య సీమంతం నిర్వహించి అన్నమీద ప్రేమను వ్యక్త పరిచారు.

చిరంజీవి సర్జా తమ్ముడు ధ్రువ సర్జా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే కన్నడలో తెరకెక్కిన ఒక సినిమాను తెలుగులో పొగరు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా ధ్రువకు మంచి పేరు తీసుకొచ్చింది. ముందు నుంచే ధ్రువకు అన్న చిరంజీవి సర్జా అంటే చాలా ప్రేమ.

అన్న బాటలోనే హీరో అయి నిలదొక్కుకున్న ధృవ అన్న అంటే చాలా ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker