Health

వీటిని తింటే మీ పేగుల్లో పేరుకుపోయిన చెత్త మొత్తం బయటకు పోతుంది.

కొన్నిసార్లు ఎక్కువగా తినకపోయినా కూడా బాగా తినేసినట్లుగా కడుపు నిండుగా, బిగుతుగా మారినట్లు అనిపిస్తుంది. అది కొవ్వా లేక గ్యాస్ సమస్య అనేది అర్థం కాదు. దీనినే ‘కడుపు ఉబ్బరం’ అంటారు. ఇది కూడా ఒక అనారోగ్యమే, ఇందుకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంచెం ఆహారం తీసుకున్నా కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది.

ఎసిడిటీ మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా.. మీ కడుపులో పేగుల్లో పేరుకుపోయిన చెత్త వలన ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. కడుపు పేగులు ఆరోగ్యాన్ని కచ్చితంగా పెంపొందించుకోవాలి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేటట్టు చూసుకోవాలి.

ఒక్కొక్కసారి మనం తీసుకునే ఆహారం పానీయాలు సరిగ్గా జీర్ణం అవ్వవు అవి పేగుల్లో పేరుకు పోతాయి పేగుల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్ధాలు టాక్సిన్స్ ని తొలగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని పాటించి ఆరోగ్యంగా ఉండండి. కడుపుని క్లీన్ చేసుకోండి. ఆరోగ్యానికి పండ్లు బాగా మేలు చేస్తాయి మీ పొట్టని కూడా పండ్లు ఆరోగ్యంగా ఉంచుతాయి పేగుల్లో మురికిని తొలగించడానికి కూడా పండ్లు హెల్ప్ చేస్తాయి.

కాబట్టి పండ్లని తీసుకుంటూ ఉండండి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. నట్స్, గింజలు, పప్పులు, కాయగూరలు వంటివి కచ్చితంగా తీసుకోండి అప్పుడు కడుపు క్లీన్ గా ఉంటుంది.

అలానే కడుపులో పేగుల్లోని వ్యర్థాలని బయటకి పంపడానికి నీళ్లు చాలా అవసరం రోజు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీళ్లు తీసుకోండి ప్రోబయోటిక్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కడుపు క్లీన్ అయిపోతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker