షుగర్ ఉన్నవారు ఈ మూడింటినీ గుర్తుపెట్టుకొని మరి తినాలి, ఎందుకంటే..?

మధుమేహం, జీవక్రియ రుగ్మత ఇటీవలి దశాబ్దాలలో విపరీతంగా పెరిగింది. లాన్సెట్ అధ్యయనం ప్రకారం 2019లో 70 మిలియన్లతో పోలిస్తే భారతదేశం ఇప్పుడు 100 మిలియన్లకు పైగా మధుమేహులకు నిలయంగా ఉంది. మధుమేహం శరీరంలోని అనేక భాగాలు, విధులను ప్రభావితం చేస్తుంది. షుగర్ వ్యాధితో పోరాడుతున్న వ్యక్తులు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు, నరాల దెబ్బతినడం, చిగుళ్ల వ్యాధి, కంటి సమస్యలు వంటి అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈరోజుల్లో చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు.
షుగర్ ఉన్నట్లయితే కచ్చితంగా ఆహారం విషయంలో కొన్ని నియమాలని పాటిస్తూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఆహారం విషయంలో తప్పులు చేయడం వలన మరింత ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా షుగర్ ఉన్న వాళ్ళు తప్పులు చేయకూడదు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, వైద్యుని సలహా తీసుకోవడం, రెగ్యులర్ గా షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి.
షుగర్ ఉన్నవాళ్లు ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. చక్కెర శాతాన్ని కూడా కంట్రోల్‌లో ఉంచగలవు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశనగలను తీసుకుంటే మంచిది. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే చక్కెర లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేయగలవు. షుగర్ తో బాధపడే వాళ్ళు బాదం తీసుకుంటే కూడా మంచిది.
బాదంలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బాదంతో రోకనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. విటమిన్ డి కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. చక్కెర ని కంట్రోల్ లో ఉంచగలవు. బాదం పప్పులో కొవ్వులు, ప్రోటీన్, పీచు షుగర్ ని కంట్రోల్ లో ఉంచగలవు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాల్ నట్స్ ని తినడం కూడా మంచిది. వాల్ నట్స్ లో పీచు ఎక్కువగా ఉంటుంది.
రక్తంలో చక్కెర పెరగడానికి వీలు లేకుండా, వాల్ నట్స్ చేస్తాయి. చక్కెరని కంట్రోల్‌లో ఉంచగలవు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇలా ఈ మూడింటినీ కూడా కచ్చితంగా షుగర్ పేషెంట్లు తీసుకోవడం మంచిది. అప్పుడు షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.