News

కొడుకును చూసి గర్వపడుతున్న నటుడు సూర్య, సూర్య కొడుకు ఏం సాదించారో చుడండి.

‘గజిని, సింగం (సిరీర్)’ వంటి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సూర్య.. ప్రస్తుతం వరుస మూవీస్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రజెంట్ ‘కంగువ’ అనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. జె. శివకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే..

ప్రజెంట్ సూర్య ప్రౌడ్ ఆఫ్ ఫాదర్ మూమెంట్‌తో చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు నటుడు సూర్య. అతడికి తమిళ్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో.. తెలుగులోనూ అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. అయితే సూర్య ఆన్ స్క్రీన్‌లో ఎంత సందడి చేసినా..

ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు. తన ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి వార్త అయినా బయటకు రాదు. అంతలా మెయింటైన్ చేస్తాడు. ఎక్కువగా సూర్య – జ్యోతిక మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినా తన కొడుకు ఫొటోలను మాత్రం తీయొద్దంటూ చెప్తుంటాడు. అయితే ఇప్పుడు సూర్య గర్వపడేలా తన కొడుకు ఓ పని చేశాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. సూర్య కొడుకు దేవ్ కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే అదే ఈవెంట్‌కు సూర్య గెస్ట్‌గా వెళ్లాడు. అక్కడ అందరినీ సత్కరించాడు. అందులో తన కొడుకు దేవ్ కూడా ఉండటంతో సూర్య ముఖం వెలిగిపోయింది. అక్కడ అందరి పిల్లలతో పాటు తన కొడుకును చూసి మురిసిపోయాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker