News

అలెర్ట్, ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

సోషల్ మీడియా విప్లవం తరువాత నెటిజెన్స్ హీరో లేదా హీరోయిన్స్ లుక్ పై వెంటనే తమ ఫీలింగ్స్ చెప్పేస్తున్నారు. అందుకే తారలు బయటికి రావాలంటే అనేక జాగ్రతలు తీసుకుంటారు . అలాగే సోషల్ మీడియాలో వారు పంచుకొనే ఫోటోలు విమర్శల పాలు కాకుండా చూసుకుంటారు. సాధ్యమైనంత వరకు అందంగా కనిపించేలా చూసుకుంటారు. అయితే బెంగాలీలో స్వస్తికా ముఖర్జీ చాలా ఫేమస్ నటి.

43 ఏళ్ల వయసున్నా.. ఇంకా పాతికేళ్ల పడచులా కనిపిస్తుంది. సినిమాలు, ఓటీటీ, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాల్లోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎన్నో బెంగాలీ సినిమాల్లో నటించినప్పటికీ స్వస్తికా ముఖర్జీకి అంతగా పేరు రాలేదు. కానీ హిందీ వెబ్‌సిరీస్..’ పాతాళ్ లోక్’ తర్వాత.. ఆమె రేంజ్ అమాంతం పెరిగింది. దర్శకులు అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ అద్భుతంగా చూపించారు.

అయితే ఆమెపై గతంలో దొంగతనం ఆరోపణలు వచ్చాయి. స్వస్తికా ముఖర్జీ 2014లో సింగపూర్‌లో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. ఓ మాల్‌లో చెవిపోగులు దొంగిలిస్తూ కనిపించింది. ఆమె బ్యాగులో చెవిపోగులు పెడుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఐతే అవి తాను కొనుగోలు చేసినవని.. రశీదు కూడా ఉందని చెప్పారు.

ఆ చెవిపోగుల విలువ రూ. 12వేల వరకు ఉంటుంది. తాను దొంగిలించలేదని చెప్పిన మొదట చెప్పిన స్వస్తికా ముఖర్జీ.. పొరపాటున జరిగి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకానీ ఉద్దేశ్యపూర్వకంగా దొంగతనం చేయలేదని స్పష్టం చేసింది స్వస్తికా ముఖర్జీ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker