Health

మీలో లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు, ముందే జాగర్త పడండి.

క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వ్యాధి. కొన్ని కోట్ల కొద్దీ కణాలతో రూపొందిన మానవ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ప్రారంభం కావచ్చు. వాస్తవానికి సహజంగానే మానవ శరీరంలోని కణాలు పెరుగుతాయి. కణ విభజన అనే ప్రక్రియ ద్వారా శరీరానికి అవసరమైన కొత్త కణాలు ఏర్పడతాయి. అయితే క్యాన్సర్ పేరు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే నేడు ఈ వ్యాధి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. కొంతమందైతే ఈ వ్యాధి ఉన్నట్టు కూడా తెలియకుండా చనిపోతున్నారు.

ఇంకొంతమందికి ఈ వ్యాధి ముదిరినంకనే తెలుస్తుంది. ఇలా తెలిసినా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ వ్యాధి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే మాత్రం దీన్ని మొదట్లోనే గుర్తించాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ వ్యాధి మొదట్లో కొన్ని లక్షణాలను చూపిస్తుంది. వాటిని గుర్తిస్తే చికిత్స తో దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. క్యాన్సర్లు ఎన్నో రకాలు. అయితే ఇవన్నీ వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. ఏ క్యాన్సర్ అయినా సరే కొన్ని సాధారణ లక్షణాలను ఒకేవిధంగా కలిగి ఉంటాయి.

ఇలాంటివి మీలో కనిపిస్తే ఎప్పటికీ లైట్ తీసుకోకండి. అలుపు.. బాగా పనిచేయడం వల్ల అలిసిపోవడం చాలా సహజం. విశ్రాంతి తీసుకుని, కంటి నిండా నిద్రపోతే ఈ అలసట తగ్గుతుంది. ఇలా కాకుండా మీరు ఎక్కువ అలసటకు గురైనా, బలహీనంగా ఉన్నా వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు. శరీరంలో గడ్డలు.. క్యాన్సర్ వల్ల శరీరంలో వివిధ భాగాల్లో గడ్డలు అవుతాయి. ఈ గడ్డలు క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. మీలో ఏ రకమైన గడ్డలు కనిపించినా వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.

అలాగే మీ శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు ఉంటే కూడా హాస్పటల్ కు చూపించుకోండి. ఎందుకంటే ఇది కూడా క్యాన్సర్ లక్షణమేనంటున్నారు నిపుణులు. బరువు తగ్గడం.. బరువు తగ్గడానికని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ఫాస్ట్ గా బరువు తగ్గరు. ఎలాంటి ప్రయత్నం చేయకున్నా ఒక వ్యక్తి అకస్మాత్తుగా బరువు తగ్గితే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది క్యాన్సర్ కు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.

ఒక వ్యక్తి ఎలాంటి ప్రయత్నం చేయకుండా బరువు తగ్గితే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. కొన్ని భాగాల్లో నొప్పి.. శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పి కలగడం చాలా సహజం. అయితే చాలా సేపు నడిస్తే ఖచ్చితంగా కాళ్లలో నొప్పి వస్తుంది. కొద్ది సేపు రెస్ట్ తీసుకుంటే ఈ నొప్పి తగ్గిపోతుంది. కానీ మీ శరీరంలోని ఏదో ఒక భాగంలో ఎప్పుడూ నొప్పి వచ్చినా.. మందులను వాడినా అది తగ్గకపోయినా మీరు ఖచ్చితంగా చెకప్ లు చేయించుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker