Health

విటమిన్ మాత్రలు వేసుకుంటున్నారా..? ఈ విషయాలు మీ కోసమే.

శరీరంలో లోపం ఉంటే విటమిన్ డి, అధిక మోతాదు విటమిన్ సి, జింక్, పొటాషియం ఉన్నాయి. ఇవి వున్న ఆహార పదార్థాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌తో శరీరం పోరాడుతుంది. అయితే వివిధ రకాల విటమిన్ మాత్రలను రోజులో ఏప్పుడైనా వేసుకోవచ్చు. అయితే ఆహారంతోపాటు తీసుకుంటే శరీరరం వాటిని బాగా గ్రహిస్తుంది. అల్పాహారం తీసుకున్న తరువాత, భోజనం చేసిన తరువాత వీటిని తీసుకోవాలి.

నీటిలో కరిగే విటమిన్ మాత్రలను రోజువారిగా ఆహారంతో పాటుగానే వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. పెద్ద మొత్తంలో పోషకాలకు సంబంధించి మందులు వేసుకుంటే వాటిని శరీరం గ్రహించే ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటి వాటిని కలిపి ఒకేసారి వేసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. వీటిని ఆహారంతోపాటు తీసుకుంటే శరీరానికి వాటికి సంబంధించి పోషకాలు అందుతాయి.

వాటిని ఒక దాని తరువాత భోజనం చేసిన తరువాత వేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చాలా మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వారు దానికి సంబంధించిన మందులను మింగుతుంటారు. ఇలా మింగే సందర్భంలో వీటితో కలిపి పోషకాల మాత్రలను మింగటం ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిరోధక మందులు వేసుకున్న గంట, నుండి రెండు గంటల సమయం తరువాత మాత్రమే విటమిన్ మాత్రలను వేసుకోవటం మంచిది.

గర్భదారణ సమయంలో చాలా మందికి విటమిన్ మాత్రలను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. వాటిని వేసుకునే క్రమంలో తప్పకుండా గర్భిణీలు కొన్ని నియమాలను పాటించాలి. ఏదైన ఆహారం తీసుకున్న తరువాత మాత్రమే విటమిన్ మాత్రలను వేసుకోవాలి. అలాకాకుండా ఎలాంటి ఆహారం తీసుకోకుండా వేసుకుంటే వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker