News

రాత్రి 8గంటల తర్వాత ఆ పని చేయనంటూ.. ఆ సీక్రెట్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్.

అందాల ఆరబోతలో పీక్ రేంజ్ లోకి వెళ్ళింది తమన్నా. ఎప్పటికప్పుడు హాట్ డోస్ వడ్డిస్తూ నెట్టింట హవా నడిపిస్తోంది. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా గ్లామర్ డోస్ దట్టిస్తూ జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అమ్మడి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే టాలీవుడ్ సినిమా ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నటి తమన్నా భాటియా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. మిల్కీ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటి తమన్నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

నటి తమన్నా భాటియా తాజాగా తన సీక్రెట్ ఒకటి బయటపెట్టింది. మిల్కీ బ్యూటీకి కూడా ఓ వింత అలవాటు ఉంది. అది వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. నటి తమన్నా తన అలవాట్ల గురించి అందరితో పంచుకుంది. ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ప్లేస్‌, ఫుడ్‌పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటానంది తమన్నా.అది కూడా సమయాన్ని బట్టి తన మానసిక స్థితి, అలసటపై కూడా ఆధారపడి ఉంటుంది మీడియాతో ఓపెన్ గా చెప్పింది. తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. నాకు ఒక చెడు అలవాటు ఉందని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని నేను ఎల్లప్పుడూ అందరికీ చెబుతాను.

నిజం చెప్పాలంటే రాత్రి 8 గంటల తర్వాత ఎక్కడికీ వెళ్లడం లేదా ఏదైనా చేయడం నాకు ఇష్టం ఉండదు. రాత్రి 8 గంటల తర్వాత పనులు చేయడం మంచిది కాదన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మ ఇద్దరూ తమ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సీక్రెట్ గా ఉంచినప్పటికి వారి డేటింగ్ పుకార్లు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా నటి తమన్నా విజయ్ వర్మతో తన ప్రేమ గురించి మాట్లాడింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. వెండితెరపై గ్లామరస్ ట్రీట్ ఇస్తూ తమన్నా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించి సూపర్ హిట్ చిత్రాలను అందించిన నటి తమన్నా.

తెలుగులో 100% లవ్, ఆగడు, ఊపిరి, రచ్చ, రెబల్, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ సక్సెస్ సినిమాల్లో తమన్నా నటించింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ తమిళం, హిందీ ప్రేక్షకుల హృదయాలను కూడా కొల్లగొట్టింది. వరుస సినిమాల్లో నటిస్తూ సూపర్ ఫామ్ లో ఉంది తమన్నా. ఐటమ్ సాంగ్స్ లో కూడా చాలా ఫేమస్ అయింది. ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయడానికి తమన్నా భారీ పారితోషికం తీసుకుంటోంది. రీసెంట్ గా జైలర్ సినిమాలో కూడా తమన్నా చేసిన సాంగ్ హిట్ అయింది.

ప్రస్తుతం ముంబైలో ఉంటున్న తమన్నా బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. OTTలో లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటించింది. విజయ్-తమన్నా బంధం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. నటి తమన్నా భాటియా టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన విజయ్‌తో ఆమె డేటింగ్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు కూడా నటి తమన్నా చేతిలో వరుస సినిమాలున్నాయి. తమన్నా భాటియా ఇటీవల ‘అరణ్మనై 4’లో కనిపించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker