Health

నిమిషాల్లో తామర తగ్గిపోవాలంటే ఏం చెయ్యాలో తెలుసా..?

తామర వచ్చిన వ్యక్తులను తాకడం లేదా వారి వాడిన వస్తువులను వాడడం, వారు ధరించిన దుస్తులను ధరించడం వంటివి చేయడం వల్ల తామర వ్యాధి వ్యాప్తిస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి తామరను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే చలికాలంలో చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి.

ముఖ్యంగా చర్మం పొడిబారడం, పగుళ్ళు ఏర్పడటం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వీటి బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వణుకు పుట్టించే చలి చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీములను కొనుగోలు చేసి చర్మానికి అప్లై చేస్తుంటారు. ఇలా చేస్తే, కొత్తకొత్త సమస్యలుకోరి తెచ్చుకోవాల్సి వస్తుంది. చలికాలంలో ప్రతి ఒక్కరి చర్మం చాలా పొడిగా, నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో ప్రధాన చర్మ వ్యాధి తామర వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో చలికాలంలో వ్యాప్తి చెందే తామర, దాని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై నిపుణులు చెబుతున్న అంశాలివి.. తామర..తామర అనేది చర్మం పొడిబారడానికి, దురదకు కారణమయ్యే పరిస్థితి. సబ్బులు, డిటర్జెంట్లు, పర్యావరణ లేదా ఆహార అలెర్జీ కారకాలు, హార్మోన్ల మార్పులు, చర్మ ఇన్ఫెక్షన్ల ద్వారా ఇది మరింత పెరగవచ్చు. అనేక రకాల తామరలు ఉన్నాయి. దీనిలో శీతాకాలపు దురద అని కూడా పిలువబడే ఆస్టిటోటిక్ తామర ఉంది. ఇది పెద్దవారిలో సాధారణం. చలికాలంలో, చర్మం పొడిబారుతుంది. కొన్ని సందర్భాల్లో పగుళ్లు, వాపులకు గురవుతుంది.

తీవ్రమైన పొడి దురద కారణంగా బాగా గోకడం వల్ల గాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా అలెర్జీ కారకాలు, బ్యాక్టీరియా చర్మంలోకి చొచ్చుకుపోయి దద్దుర్లు లేదా ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. ఈ రకమైన తామర సాధారణంగా కాళ్ల కింద భాగంలో వస్తుంది. చికిత్స ఇది.. దీనికి ప్రాథమిక చికిత్స చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం. అలాగే నీటి ఆధారిత లోషన్లు చర్మం పొడిబారడాన్ని మరింత దిగజార్చుతాయి. వాటిని దూరం పెట్టాలి. అవకాశం ఉంటే పెట్రోలియం జెల్లీ, మినరల్ ఆయిల్ లేదా వ్యాసెలిన్ వంటి అధిక ఆయిల్ కంటెంట్ ఉన్న మాయిశ్చరైజర్‌లను తడి చర్మంపై అప్లై చేయడం మంచిది.

తామర కోసం ప్రత్యేకంగా రూపొందించిన హైపోఅలెర్జెనిక్, యాంటీ-ఇచ్ మాయిశ్చరైజర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే వేడినీళ్ల జల్లు స్నానం, తేలికపాటు సబ్బు వాడటం చేయాలి. దురద, పొడిబారడం ఎక్కువ రోజుకు కొనసాగితే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చేతులను సంరక్షించుకోవాలి.. మీ చేతులు తరచుగా చల్లని, పొడి గాలికి ఎక్స్ పోస్ కావడం వల్ల కూడా చేతి తామర తీవ్రమవుతుంది. చేతులపై స్కేలింగ్, పగుళ్లు, రక్తస్రావం అయ్యే అవకాశం ఉటుంది. ఈ సమయంలో పెట్రోలియం ఆధారిత సువాసన లేని మాయిశ్చరైజర్‌ను వాడటం మంచిది. యాంటీ బాక్టీరియల్ సబ్బుల వాడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker