Health

టీ తాగడానికి ఎన్ని నిమిషాల ముందు నీళ్ళు తాగాలో తెలుసుకోండి. ముందే తాగితే..?

టీ తాగడానికి ముందు నీరు తాగడం మంచిదే టీ PHవిలువ 6. ఇది తటస్థమైనదే అయినా ఇందులో ఉన్న ఆమ్ల గుణం కారణంగా ప్రేగులు ప్రభావానికి లోనవుతాయి. కానీ టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల ప్రేగులను నీరు కప్పి ఉంచుతుంది. దీనివల్ల టీలో ఉన్న ఆమ్ల ప్రభావం ప్రేగులమీద పనిచేయదు. అయితే చాలామందికి టీ తాగకపోతే రోజు గడవదు. టైమ్‌కు కప్పు టీ కడుపులో పడకపోతే తలనొప్పి కూడా వచ్చేస్తుంది చాలా మందికి.

ఇక మన దేశంలో ఉదయం టీ తాగడం అదూ ఒక పని మాత్రమే కాదు, ఇది ప్రజల జీవితాలో ముడిపడి ఉన్న ఒక ఆహార అనుభూతి. ఇక్కడి సంస్కృతిలో టీ ఒక భాగం. మన దేశంలో ఏ సందు, మూలలో చూసినా ఒక టీ స్టాల్‌ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సుఖమైనా, సంతోషమైన, దుఃఖమైనా సరే.. టీ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలికేందుకు కూడా ముందుగా టీనే ఇస్తుంటాం.. ఇక్కడి ప్రజలకు టీ అంటే చాలా ఇష్టం.

అయితే, ఖాళీ కడుపుతో టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, టీ తాగే ముందు నీళ్ళు తాగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఖాళీ కడుపుతో తీసుకునే టీ, కాఫీ రెండూ కడుపుకు ప్రమాదకరమే. ఇది కడుపులోకి వెళ్ళినప్పుడు యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. టీ pH విలువ 6 అయితే కాఫీ pH విలువ 5. అటువంటి పరిస్థితిలో, మీరు టీ లేదా కాఫీ తాగినప్పుడు శరీరంలో అనేక ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. అయితే టీ లేదా కాఫీ తాగే ముందు నీళ్లు తాగితే కొంతవరకు బెటర్‌ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇది ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. కాఫీ, టీలకు ముందుగా నీటిని తాగడం వల్ల టీ, కాఫీ వల్ల కలిగే హాని నుండి రక్షించే పొర పేగులో ఏర్పడుతుంది. అలాగే, బెడ్‌ టీ, లేదా ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా హానికరం. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది.

ఇది దంతాలను కూడా పాడు చేస్తుంది. చాలా వరకు, ఇది దంత క్షయాన్ని కూడా పెంచుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు. టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి నష్టం కల్గిస్తుంది. అందుకే టీ, కాఫీ తాగేముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. టీ-కాఫీ తాగే అలవాటుంటే..అంతకంటే 15 నిమిషాల ముందు నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ అలవాటు అనేక వ్యాధుల నుంచి మీ శరీరానికి సంరక్షణ ఇస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker