ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు, మీరు వెంటనే నిద్రలోకి జారుకుంటారు.

నిద్ర ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. అయితే నిద్రలేమి సమస్యతో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. సరిగ్గా నిద్రలేకుంటే.. మరుసటి రోజు ఉత్సాహంగా ఉండలేరు. రోజంతా సరిగా ఉండరు. ఇది మీ పనిపై ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీరు చక్కటి నిద్రను పొందొచ్చు. నిద్రలేమి సమస్య రావడానికి అనే కారణాలు ఉంటాయి.
మారిన జీవన విధానం, ఒత్తిడి, ఆందోళన, మనం తీసుకునే ఆహారం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం లాంటివి కారణాలు అవుతాయి. అయితే మంచి నిద్రపొందేందుకు ఓ చక్కటి చిట్కా ఉంది. గాఢ నిద్రలోకి వెళ్తారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు.. ధనియాలను ఉపయోగించండి. ఒక గ్లాస్ నీటిలో టీ స్పూన్ ధనియాలను వేసుకుని బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి గోరు వెచ్చగా అయిన తర్వాత తాగాలి. లేదంటే.. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ధనియాలను మూడు గంటలపాటు నానబెట్టాలి. తర్వాత ఈ నిటిని వడకట్టి తాగితే ఫలితం ఉంటుంది.
రోజు పడుకునే ముందు తీసుకుంటే.. చక్కటి నిద్రను మీ సొంతం చేసుకోవచ్చు. నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు తలనొప్పి, ఒత్తిడి వంటి వాటిని దూరం చేస్తుంది. ధనియాలను ఉపయోగించడం వలన.. చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. సరైన నిద్రకు మరికొన్ని పాటించాలి. నిద్రవేళకు ముందు ఎక్కువగా భోజనం(Food) తినకండి. నిద్రవేళకు దగ్గరగా ఉన్న సమయంలో ఎక్కువ భోజనం తినడం అసౌకర్యం, అజీర్ణానికి దారి తీస్తుంది. నిద్రను కష్టతరం చేస్తుంది. నిద్రవేళకు కనీసం రెండు గంటల ముందు తేలికపాటి భోజనం చేయాలని నిపుణులు చెబుతారు.
కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. పడుకునే ముందు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ నిద్ర విధానాలకు ఆటంకం కలుగుతుంది. కెఫిన్ మిమ్మల్ని మేల్కొని ఉంచుతుంది. ఆల్కహాల్ విరామం లేని నిద్ర, తరచుగా మేల్కొలుపులకు కారణమవుతుంది. నిద్రను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవడం పెంచాలి. చెర్రీస్, బాదం, కివి, వెచ్చని పాలు వంటి కొన్ని ఆహారాలు సహజమైన నిద్రను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల నిద్రను మెరుగుపరుస్తుంది.
చక్కెర మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయాలి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా మీ నిద్ర విధానాలకు భంగం కలిగిస్తాయి. ముఖ్యంగా నిద్రవేళకు ముందు ఈ ఆహారాల తీసుకోవడం పరిమితం చేయాలి. నిద్రవేళ దినచర్యను రూపొందించుకోవాలి. దీనివలన మీ శరీరానికి ఇది నిద్రపోయే సమయం అని సూచించడంలో సహాయపడుతుంది. దీనికోసం చదవడం, వెచ్చని నీటితో స్నానం చేయడం, మంచి సంగీతం వినడం వంటి కార్యకలాపాలు అలవాటు చేసుకోవాలి.