Health

మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి, లేదంటే మీకు తొందరలోనే క్యాన్సర్ రావొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు.. రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. క్యాన్సర్‌ చాలా రకాలు ఉన్నాయి.. క్యాన్సర్‌తో బాధపడే ప్రతి ఒక్కరికి.. వివిధ లక్షణాలు కనిపిస్తాయి. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్‌ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. మహిళలలో బ్రెస్ట్‌, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ క్యాన్సర్లు ఎక్కువగా చూస్తుంటాం. అయితే క్యాన్సర్ పై అవగాహన పెంచుకుంటే వాటిని తొలినాళ్లలోనే గుర్తించడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రతీయేటా ఎంతో మంది మహిళలు పలు రకాల క్యాన్సర్ల భారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతీయేటా ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా క్యాన్సర్ ముప్పు ముందే గుర్తించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మీ ఆహారంలో వీలైనన్ని ఎక్కువ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

పండ్లు, కూరగాయలలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ పెరగకుండా నిరోధిస్తాయి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ప్రతీరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా నడవడం మంచింది. అది మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంలో తోడ్పడుతుంది. చురుగ్గా ఉండటం వల్ల రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతీరోజూ ఏదోఒక వ్యాయమం లేదా వాకింగ్, సైక్లింగ్, ఈత కొట్టడం వంటి చేయడం మంచిది. పొగాకు తినడం, ధూమపానం వల్ల ముఖ్యంగా నోటి క్యాన్సర్ కు కారణం అవుతుంది.

క్యాన్సర్ వల్ల సంభవించే మరణాలలో సగానికిపైగా పొగాకు, ధూమపానం వల్లనే వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పొగాకు, గుట్కా, సిగరేట్ తాగడం వంటివి పూర్తిగా మానేయాలి. మద్యం అతిగా సేవించవద్దు. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయంపై చెడు ప్రభావం పడుతుంది. ఇది రొమ్ము, పెద్ద ప్రేగు, కాలేయం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం సేవించినా కేవలం తక్కువ మోదులో మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకోవటం ద్వారా క్యాన్సర్ తో పాటు ఇతర వ్యాధులకు కారణం అవుతుంది.

మీరు క్యాన్సర్ ముప్పుకు దూరంగా ఉండాలంటే సూర్యుని నుంచి వెలువడే హానికరమైన యూవీ కిరణాలకు దూరంగా ఉండాలి. దీంతో చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సూర్యకాంతి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ సన్ స్క్రీన్ ని ఉపయోగించుకుంటే మంచిది. బట్టలతో చర్మాన్ని కప్పి ఉంచుకోవాలి. ఉదయం వేళల్లో సూర్యకాంతి మన శరీరంపై పడేలా చూసుకోండి. ఉదయం వేళ సూర్యక్రాంతి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker