Health

ఈ నూనె రోజూ ఒక స్ఫూన్ తాగితే చాలు, ఆ సమస్యలన్ని వెంటనే తగ్గిపోతాయి.

జుట్టు రాలే సమస్యను దూరం చేసుకోవాలంటే.. నల్ల జీలకర్ర నూనె మనం ఇంట్లోనే తయారుచేసుకుని వాడుకోవచ్చు. నల్ల జీలకర్ర నూనె మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని బాగా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. అయితే మంచి ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు మాత్రమే కాదు నూనెలు కూడా డైట్‌లో ఉండాలి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆయిల్స్ చాలానే ఉన్నాయి. వాటిలో నల్ల జీలకర్ర తో తయారు చేసే నూనె ప్రత్యేకంగా నిలుస్తోంది. దీన్ని బ్లాక్ సీడ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. దీన్ని కొద్ది మొత్తం తాగితే డైజెషన్‌ హెల్త్‌ ఇంప్రూవ్ అవుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. బ్లాక్ సీడ్ ఆయిల్‌ను శతాబ్దాలుగా వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది సూపర్‌ఫుడ్స్‌కు సప్లిమెంట్‌గా పాపులర్ అయింది. ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ బ్లాక్ సీడ్ ఆయిల్‌ తాగితే.. చర్మం, గట్, జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. కేవలం 2-3 వారాలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీన్ని స్మూతీస్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. స్కిన్‌కేర్ రొటీన్‌లో భాగంగా జుట్టుకు అప్లై చేయవచ్చు. మొటిమలు, తామర లేదా సోరియాసిస్ వంటి అనారోగ్యాలు ఉన్నవారు బ్లాక్ సీడ్ ఆయిల్ వాడితే ఉపశమనం పొందవచ్చు.

ఉబ్బరం, గ్యాస్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ , సాధారణ డైజెషన్ ప్రాబ్లమ్స్‌తో బాధపడే వారు కూడా దీన్ని వాడవచ్చు. అంతేకాకుండా, కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ వంటి క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ పరిస్థితులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. బ్లాక్ సీడ్ ఆయిల్‌లో థైమోక్వినోన్, థైమోల్, థైమోహైడ్రోక్వినోన్ వంటి సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి.

ఈ సమ్మేళనాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఎంజైమ్ ఇన్హిబిషన్ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జిందాల్ నేచర్‌క్యూర్ ఇన్‌స్టిట్యూట్‌లోని చీఫ్ డైటీషియన్ సుష్మా పిఎస్ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’తో మాట్లాడుతూ ఖాళీ కడుపుతో బ్లాక్ సీడ్ ఆయిల్ తాగడం మంచిదని చెప్పారు. నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించగలవని డైటీషియన్ & సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్ డాక్టర్ అర్చన బాత్రా పేర్కొన్నారు.

కొంతమందిలో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయని తెలిపారు. అయితే బ్లాక్ సీడ్ ఆయిల్‌ను వాడటానికి ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఇది కొందరికి పడకపోవచ్చు. కొంతమందిలో అనవసర రియాక్షన్లు బయటపడవచ్చు. ప్రయోజనాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా లభిస్తాయి. అందుకే వాడొచ్చో లేదో, ఎంత మోతాదులో వాడాలో వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker