Health

క్యాన్సర్‌ వచ్చే ముందు పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి, మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?

ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. మన దేశంలో, ప్రతి సంవత్సరం సుమారు పదకొండు లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతోంది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయి. అయితే, మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి, వ్యాధి ముదిరిన తరవాతే ఇది నిర్ధారణ అవుతోంది. దీంతో బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి.

అయితే కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. కింద ఇచ్చిన పలు లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు. చర్మంలో అకస్మాత్తు మార్పులు, రక్తస్రావం అవడం, మచ్చల వంటివి ఎక్కువ కాలం ఉంటే ప్రమాదకరంగా మారవచ్చు.

అంతే కాదు ఇవి చర్మ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. అలసట, ఆయాసం ఎక్కువగా, ఎక్కువ సేపు ఉంటే అది పెద్దపేగు లేదా పొట్టకు సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దాని లక్షణాలను పరిశీలించాల్సిందే. ఛాతి చుట్టూ ఎరుపుదనం, నిపుల్స్ నుంచి డిశ్చార్జి వంటి లక్షణాలు ఉంటే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్‌గా పరిగణించాలి.

నోట్లో లేదా నాలుకపై తెల్లని ప్యాచ్‌లు ఎక్కువ కాలం పాటు ఉంటే అది ప్రమాదకరమైన ఓరల్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్‌కు సూచనగా భావించాలి. కడుపులో ఎల్లప్పుడూ నొప్పిగా ఉండడంతోపాటు ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉంటే దాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌గా అనుమానించాలి. ఆహారాన్ని మింగడంలో ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ కావచ్చు.

లింఫ్ గ్రంథులు లేదా గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బి ఉన్నా దాన్ని గొంతు క్యాన్సర్‌గా అనుమానించాలి. వృషణాల సైజ్‌లో మార్పు, వాపు, భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్‌గా భావించాలి. మ్యూకస్ లేదా ఉమ్మిలో రక్తం వస్తుంటే దాన్ని ఊపిరితిత్తులు లేదా ఓరల్ క్యాన్సర్‌గా భావించాలి. మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తున్నా ఆ పరిస్థితిని ప్రోస్టేట్ క్యాన్సర్‌గా అనుమానించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker