ఈ కాలంలో కీరా దోసకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?
కీర దోసకాయ దాని పరిచయం అవసరం లేని పేరు. కీరలో 90-95 శాతం నీటిని కలిగి వుండటమే కాకుండా తక్కువ కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్స్ మరియు సోడియంలను కలిగి టుంది. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది విటమిన్ –ఎ, విటమిన్ బి6, విటమిన్ సిను కలిగి వుంటుంది.
అయితే ఆయుర్వేదం ప్రకారం కీర దోసకాయకు మూడు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. శీతలీకరణ, వైద్యం, ఆస్ట్రిజెంట్. ఇది మొక్కల ఆధారిత ఆహార పదార్థం. దీని లక్షణాలు సేంద్రీయమైనవి. ఈ కీరా శరీరాన్ని చల్లబర్చడానికి సహాయపడుతుంది. కడుపులో వేడిని ఉత్పత్తి చేసే ఔషదం లేదా ఏదైనా ఆహార పదార్థానికి అలెర్జీ అయితే దానిని తగ్గిస్తుంది. అలాగే కాలిన గాయలను, మొటిమలను, దద్దుర్లను తగ్గిస్తుంది.
కీరదోసకాయ కఫ, పిత్తం, వాతం వంటి మూడు దోషాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. అయితే చలికాలంలో కీరాను తినొచ్చా..సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్లు, జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు చలికాలంలో కీరదోసకాయను తినకపోవడమే మంచిది. ఎందుకుంటే ఇది సహజ శీతలీకరణ, ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ సీజన్ లో శరీరానికి వెచ్చదనం కావాలి.
కానీ కీరాలు మన శరీరంలో వేడిని తగ్గిస్తాయి. కీరదోసకాయలను తిన్నా లేదా దాని రసం తాగినా శరీరంలో కఫం కంటెంట్ పెరుగుతుంది. ఇది జలుబుకు దారితీస్తుంది. శీతాకాలంలో కూడా కీరదోసకాయను తినాలనుకునే వాళ్లు పగటిపూట మాత్రమే తినాలి. ముఖ్యంగా సూర్య రశ్మిలో ఉన్నప్పుడు కీరదోసకాయను తినడం వల్ల శీతాకాలంలో సంక్రమణ ఎక్కువయ్యే అవకాశాలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఈ కాయను ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.