Health

వీటిని తింటే చాలు, మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది.

సాధారణంగా డ్రై ప్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ప్రతిరోజు క్రమంతప్పకుండా తీసుకోవటం వలన చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. అయితే దీనితో చేసిన పొడిని పాలలో కలుపుకుని తాగుతారు. ఇవి నమలడానికి కాస్త గట్టిగా ఉంటాయి. కానీఈ వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ఫైబర్ పుష్కలం.. టైగర్ నట్స్ లో కరిగని ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఇది జీర్ణం కాకుండా పేగుల నుంచి వెళ్తుంది. ఇందులోని పీచు పదార్థం మలవిసర్జన సజావుగా సాగేలా చేస్తుంది. గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. ఇందులో లైపీస్, అమైలెస్ వంటి ఎంజైమ్ లు ఉన్నాయి. పేగుల్లోని ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో ఇవి సహాయపడతాయి. గ్యాస్, పొట్ట ఉబ్బడం, అజీర్తి, అతిసారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ నియంత్రణ.. ఈరోజుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య మధుమేహం.

దీన్ని నియంత్రించగలిగే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడే అమినో యాసిడ్ ఆర్జినైన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుతాయి. యాంటీ బ్యాకర్టీయా గుణాలు.. ఒక అధ్యయనం ప్రకారం ఇందులో అసిటోన్, ఇథనాల్, క్లోరోఫామ్, పెట్రోలియం ఈథర్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి. ఇకోలి, సాల్మొనెల్లా, సెయింట్ ఆరియస్ కి వ్యతిరేకంగా పని చేస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది.. వీటిలో కరగని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులోని ఓలేయిక్ యాసిడ్, విటమిన్ ఇ అధిక మొత్తంలో ఉండటం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రీబయోటిక్.. పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే ప్రీబయోటిక్ ఇందులో సమృద్ధిగా లభిస్తుంది. శరీరంలోని చెడు బ్యాకర్టీయాతో పోరాడేందుకు సహాయపడుతుంది.

మెరుగైన జీర్ణ వ్యవస్థకు దోహదపడతాయి. గట్ లో మంచి బ్యాక్టీరియా ఏర్పడేందుకు సహాయం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేలా చేస్తుంది. రిచ్ యాంటీ ఆక్సిడెంట్.. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి జీర్ణవ్యవస్థని రక్షించుకోవడం కోసం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి టైగర్ నట్స్ లో మెండుగా లభిస్తాయి. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో మెరుగ్గా పని చేస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker