News

బంగారం కొనే వారికి అదిరే శుభవార్త, భారీగా పడిపోయిన బంగారం ధరలు.

బంగారం ధరలకు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తులం బంగారం రూ. లక్షలకు చేరడం ఖాయమని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరటనిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల లేకపోగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. ఏపీ, తెలంగాణలో పసిడి రేట్లు దిగి వచ్చాయి. గోల్డ్ కొనుగోలు దారులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..! దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,290కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,370గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 67,240కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,350కి చేరింది.

బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. మంగళవారం వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. మంగళవారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 86,400గా ఉంది. ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 86,400 వద్ద కొనసాగుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker