News

ఎవరు ఈ టోపీ అమ్మ..! జనం మతి స్థిమితం లేని మహిళను ఎందుకు మొక్కుతున్నారు..?

తమిళనాడులోని తిరువణ్ణామలై రకరకాలుగా ప్రసిధ్ధి చెందింది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది ఇక్కడేనంటారు. సృష్టిలోని పంచ భూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల ఆగ్ని, వాయు, జల, ఆకాశ భూలింగాలుగా వెలిశాడు. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు. అయితే తమిళనాడులోని తిరువణ్ణాలమై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి తెలిసిందే. గిరి ప్రదిక్షణలకు ఈ గుడి పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుందీ టోపీ అమ్మ.

అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుందీమే. ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తున్నారు, ఆమెను పూజిస్తారు. ఆమె తాగి పడేసిన టీ కప్పును మహా ప్రసాదంగా భావిస్తుంటారు. ఎవరితో మాట్లాడదు. కానీ అంతా ఆమె వెంట పడుతున్నారు. ఎంత అమూల్యమైన వస్తువును ఇచ్చినా విసిరిపారేస్తుంది. సాయంత్రం అయితే చాలా యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తుంది. అక్కడ ప్రజలు ఆమె దర్శనం కోసం బారులు తీరుతుంటారు.

అయితే మతిస్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారనే దాని వెనకాల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం.. కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేది. కారు టైర్‌ కింద పడిపోయిన ఒక కుక్క పేగుల అన్ని బయటకు రాగా, ఆమె ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకు ప్రాణం పోసిందని.. ఆ తర్వాత నుంచి ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తూ వచ్చారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించి మళ్లీ టోపీ అమ్మగా జన్మించిందని కొందరి విశ్వాసం.

అలాగే కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా టోపీ అమ్మ అనుగ్రహం పొందగానే ఆ సమస్య తగ్గిపోయిందని దీంతో టోపీ అమ్మను దైవంగా భావించడం మొదలైంది. ఇక టోపీ అమ్మ ప్రతీ రోజు కచ్చితంగా గిరి ప్రదిక్షణలు చేస్తుంది. ఆమె ఇప్పటి వరకు ఏకంగా 11 వేల సార్లు గిరి ప్రదిక్షణలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమెను దేవతగా భావిస్తూ పూజిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker