అ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్ళిన ఉపాసన, వెంటనే రామ్ చరణ్ ఏం చేసాడో తెలుసా..?
ఉపాసన-రామ్ చరణ్ 2012లో వివాహం చేసుకున్నారు. పెళ్ళై పదేళ్లు దాటినా పేరెంట్స్ కాలేదు. ఈ క్రమంలో విమర్శల పాలయ్యారు. ఉపాసనకు తల్లి అయ్యే యోగం లేదంటూ దారుణమైన విమర్శలు చేశారు. 2022 డిసెంబర్లో చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాసన గర్భం దాల్చిన విషయం బయటపెట్టారు. అయితే డిప్రెషన్ సినిమా ఇండస్ట్రీలో ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం.. నిజానికి చాలా మందికి ఈ సమస్య ఉంటుంది.
కానీ సినిమావాళ్లు ఎక్కువగా ఈ సమస్య గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ డిప్రషన్ సమస్య గురించి మాట్లాడారు. ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నారో కూడా తెలిపారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా డిప్రషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను కూడా డిప్రషన్ ను ఎదుర్కొన్నా అని తెలిపారు ఉపాసన. అలాగే రామ్ చరణ్ వల్లే ఆ డిప్రషన్ నుంచి బయట పడ్డాను అని తెలిపారు ఉపాసన.
తన భర్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ థెరపిస్ట్ అని అన్నారు ఉపాసన. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డెలివరీ తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపారు. తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ అద్భుతమైన విషయం. ప్రసవం అనేది ఎన్నో సవాళ్లతో ఉంటుందని అన్నారు. అలాగే డెలివరీ తర్వాత డిప్రషన్ ను ఈజీగా తీసుకోవద్దు అని అన్నారు ఉపాసన. అందరిలానే నేను కూడా డెలివరీ తర్వాత చాలా ఒత్తిడికి గురయ్యాను.
డిప్రషన్ లోకి వెళ్ళాను. ఆ సమయంలో నా భర్త చరణ్ నాకు ఎంతో అండగా నిలిచాడు. నాతో పాటు నా పుట్టింటికి వచ్చాడు. నాకు ఎంతో సాయం చేశాడు. అందరికి ఈ అదృష్టం ఉండదు. క్లీంకార విషయంలోనూ చరణ్ చాలా శ్రద్ద చూపిస్తాడు.నా భర్త నా కూతురిని చూసుకునే విధానం చూస్తే ముచ్చటేస్తుంది అని ఉపాసన తెలిపారు. క్లీంకార చాలా విషయాల్లో చరణ్ లానే ఉంటుంది. అంతే కాదు ఆహారపు అలవాట్లు కూడా చరణ్ లానే ఉంటాయి అంటూ చెప్తూ ఉపాసన మురిసిపోయారు.