News

గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి బిగ్ అలర్ట్, అమలు లోకి కొత్త రూల్స్.

అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల.. ఇలా దేనికైనా యూపీఐ యాప్స్​తో​ డబ్బులు కడుతున్నారు. ఇది ప్రారంభమైనప్పటి నుంచి రోజూ కోట్లలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపులను మరింత మెరుగ్గా చేయడానికి ప్రభుత్వం కొన్ని మార్పులూ చేర్పూలు చేసింది. అయితే జనవరి 1 తేదీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ అంటే UPI వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. మీరు 1 సంవత్సరం పాటు UPI ఖాతాను ఉపయోగించకుంటే..వీలైనంత త్వరగా దాన్ని ఉపయోగించండి. లేదంటే మీ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గత ఏడాది కాలంగా తమ UPI ఖాతాను ఉపయోగించని వినియోగదారులను డీయాక్టివేట్ చేయాలని అన్ని చెల్లింపు యాప్‌లను ఆదేశించింది. UPI మోసాన్ని ఆపడానికి NPCI ఈ చర్య తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆలస్య రుసుముతో ITR ఫైల్ చేయడానికి గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది.

కాబట్టి మీరు ఈ పనిని ఇంకా పూర్తి చేయకపోతే వీలైనంత త్వరగా పూర్తి చేయండి. దీంతో సవరించిన ఐటీఆర్‌ దాఖలుకు గడువు ముగియనుంది. తమ ఖాతాదారులందరినీ కొత్త లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని అన్ని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఇందుకోసం డిసెంబర్ 31వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా కొత్త లాకర్ ఒప్పందంపై సంతకం చేయకపోతే మీకు చివరి అవకాశం ఉంది.

ప్రభుత్వం ఇప్పుడు సిమ్ కార్డులను జారీ చేయడానికి వినియోగదారులకు పేపర్‌లెస్ KYC సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు కొత్త SIM కార్డ్‌ని పొందడానికి కస్టమర్‌లు డాక్యుమెంట్‌ల ఫిజికల్ వెరిఫికేషన్‌ను పొందవలసి ఉంటుంది. దీనికి చాలా సమయం పట్టేది. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరంలో రూల్స్ మారనున్నాయి.

జనవరి 1 నుండి సిమ్ కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు డిజిటల్ వెరిఫికేషన్ చేయడం ద్వారా సులభంగా కొత్త సిమ్‌ని పొందవచ్చు. మిగిలిన సిమ్‌లను పొందే నిబంధనలలో ఎలాంటి మార్పు లేదని గుర్తుంచుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker