News

విమానంలో ఉపాసన పాదాలకు మసాజ్ చేసిన రామ్ చరణ్, ఆస్కార్ రేంజ్ హీరో అయినా..?

తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ న‌గ‌ర్ వెళ్లారు రామ్ చరణ్- ఉపాసన. ఇందుకోసం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటుచేసుకున్నారీ లవ్లీ కపుల్. విమానంలో తన సీట్లో నిద్రించిన ఉపాసన.. తన ఎదురుగా ఉన్న రామ్‍చరణ్‍పై కాలు మోపింది. ఆ సమయంలో రామ్‍చరణ్ ఉపాసన పాదాలను మృదువుగా నొక్కుతూ మసాజ్ చేశారు. అయితే రామ్ చరణ్, ఉపాసన ఈ ప్రేమ జంట.. పెళ్లయిన జంట.. పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత క్లింకారాను పొందిన జంట..

ఎక్కడికి వెళ్లినా సందడి చేస్తూనే ఉంటుంది ఆ జంట. రామ్ చరణ్ ఉపాసనను చూసుకునే విధానం.. ఉపాసన రామ్ చరణ్ కు ఇచ్చే ప్రాధాన్యం ముచ్చట గొలుపుతుంది. ఆ మధ్య తమ కూతురి నామకరణ వేడుకలో ఉపాసన భావోద్వేగానికి గురయితే రామ్ చరణ్ ఓదార్చాడు. ఆ దృశ్యం చాలా మందిని కదిలించింది. ప్రయాణాలు చేయడం అంటే రామ్ చరణ్ కు, ఉపాసనకు చాలా ఇష్టం. ఇద్దరు సరదాగా ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంటారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.

ఇటీవల రామ్ చరణ్ ఉపాసన తమ సొంత విమానంలో వేరే ప్రాంతానికి బయలుదేరారు. ప్రయాణంలో అలసిపోయిందో.. లేక మరేమిటో తెలియదు కానీ ఉపాసన ఇబ్బందిని రామ్ చరణ్ తెలుసుకున్నట్టున్నాడు. ఆమె కాళ్ళకు మర్దన చేయడం మొదలుపెట్టాడు. దీనిని ఎవరు ఫోటో తీశారో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇంకేముంది క్షణాల్లో చుట్టేయడం మొదలుపెట్టింది. అసలే స్మార్ట్ ఫోన్ కాలం కాబట్టి.. ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆస్కార్ రేంజ్ హీరో అయినప్పటికీ భార్య కాళ్లు పట్టుకోవాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. ఎంతవారు గాని భార్య ముందు పాదదాసులే అని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రామ్ చరణ్ సింప్లిసిటీ బాగుందని ఇంకొంతమంది అంటున్నారు. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్, బుచ్చిబాబు దర్శకత్వంలో ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందే ఓ సినిమాలో నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker