Health

ఎక్కువసార్లు మూత్రం వస్తుందా..! అయితే ఈ వ్యాధులకు గురయ్యారని అర్థం చేసుకోండి.

రోజుకి 7 నుండి 8 సార్లు మూత్రవిసర్జన చేయడం మంచిది. రాత్రిపూట కొద్దిగా నీళ్లు తాగితే, రెండు, మూడు సార్లు మూత్ర విసర్జన వస్తుంది. రాత్రి పదే పదే మూత్రవిసర్జన కి వెళ్లడం మంచి సూచన కాదు. అయితే శరీరంలోని ప్రతి అవయం ప్రత్యేకమైన పనితీరును కలిగి ఉంటుంది. ఏ అవయవం పనితీరు లోపించినా శరీరంలో ఏదో ఒక సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.

మీరు తరచూ మూత్రవిసర్జన సమస్యను ఎదుర్కొంటుంటే అది మీకు ప్రమాదకరమని గుర్తించండి. అలాగే మీ నిద్ర వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మీరు తరచుగా మూత్రవిసర్జన సమస్యతో బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఒక సాధారణ వ్యక్తి రోజుకు 3 లీటర్లకు మించి మూత్ర విసర్జన చేస్తే అతడు పాలియురియా అనే వ్యాధితో బాధపడుతున్నాడని అర్థం. ఈ వ్యాధిని డాక్టర్ చికిత్సతో నయం చేయవచ్చు.

కానీ కొన్నిసార్లు ఈ సమస్య ఒకేసారి అనేక వ్యాధులకు కారణం కావచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక సాధారణ వ్యక్తి ఒక సమయంలో 4 నుంచి 7 సార్లు మూత్రం కోసం వెళ్తాడు. మీరు 24 గంటల్లో 2 లీటర్ల కంటే ఎక్కువ నీరు లేదా ద్రవాలు తాగితే మీరు 4 నుంచి 7 సార్లు మూత్రానికి వెళుతారు. వ్యాధుల సంకేతాలు ఏమిటి.. వైద్యుల అభిప్రాయం ప్రకారం..

చాలామంది ఈ సమస్యను తరచుగా విస్మరిస్తారు. ఇది తప్పు. దీనివల్ల ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 1. ప్రోస్టేట్ 2. కిడ్నీ లేదా యూరిట్రిక్ రాయి విస్తరణ 3. మూత్ర మార్గ సంక్రమణ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) 4. డయాబెటిస్ 5. ఓవర్‌యాక్టివ్ మూత్రాశయం. వీలైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్ళండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..

మీరు తరచూ మూత్రవిసర్జన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు బిడియం వల్ల సమస్యను దాచవద్దు. సరైన సమయంలో వైద్యుడి సహాయంతో, వ్యాధి నుంచి బయటపడవచ్చు. కొంతమంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యాయామం సహాయంతో ఈ సమస్యను నయం చేయవచ్చు. కానీ మీరు డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే డయాబెటిస్ వంటి వ్యాధి తెలుస్తుంది. అందుకే దీనిని విస్మరించకండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker