News

వామ్మో, ఊర్వశి రౌతేలా మెడలోని మొసలి డిజైన్‌ నెక్లెస్‌ ధర ఎన్ని వందల కోట్లో తెలుసా..?

పింక్ కలర్ గౌన్‌లో బుట్టబొమ్మలా మెరిసిపోయిన ఊర్విశి రౌతేలా మెడలో, చెవులకు మొసలి ఆకారంతో ఉన్న జువెలరీ వేసుకొని అందర్ని దృష్టిని తనపై కాకుండా తాను వేసుకున్న నగలపైకి మళ్లించింది. ఆమె వేసుకున్న ఆ నగల ఖరీదుపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ 76ఎడిషన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఊర్వశి రౌతేలా ఇలాంటి డిఫరెంట్‌ నగలతో ప్రత్యక్షమవడం, ఆ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ భామ వేసుకున్న మొసలి నగలు డూప్లికేట్‌వని కామెంట్స్ షేర్ చేయడంతో దాని అసలు ధర తెలిసిపోయింది. అయితే 76 వ కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తన అందాలతో ప్రపంచాన్ని ఊర్వశి రౌతేలా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా మే 16న ఆమె వేసుకున్న కాస్ట్యూమ్‌ నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ముఖ్యంగా ఆమె పెట్టుకున్న మొసలి నెక్లెస్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పింక్‌ కలర్‌ గౌనులో మెరిసిన ఊర్వశి.. మెడలో తనకెంతో ఇష్టమైన మొసలి నెక్లెస్‌, చెవులకు మొసలి రింగులు పెట్టుకుంది. ఆ తర్వాత దీనిపై నెట్టింట చర్చ జరిగింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫేక్ నెక్లెస్‌ పెట్టుకుని వెళ్లారా అని ఊర్వశి రౌతేలాను ప్రశ్నించారు. దీంతో ఆమె టీమ్‌ దీని ధరను ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. ఊర్వశి ధరించిన నెక్లెస్‌ ఫేక్‌ కాదు.. దాని ధర రూ.200 కోట్ల దాకా ఉంటుందని వెల్లడించారు.

దీని ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నెక్లెస్‌ను ఫ్రెంచ్ లగ్జరీ సంస్థ కార్టియర్ తయారు చేసింది. ఒరిజినల్ నెక్లెస్ అనేది కార్టియర్ బ్రాండ్ యొక్క అత్యుత్తమ కలెక్షన్ పురాతన ఆభరణాలలో భాగం. ఈ నెక్లెస్ మొదటిసారిగా 2018 సంవత్సరంలో పరిచయం చేయబడింది. ఈ నెక్లెస్‌లో కేవలం ఒక మొసలిని తయారు చేయడంలో వెయ్యికి పైగా కట్ ఫ్యాన్సీ పసుపు వజ్రాలు ఉపయోగించబడ్డాయి.

ఇందులో 18 క్యారెట్ల పసుపు బంగారాన్ని కూడా ఉపయోగించారు. నెక్లెస్‌లో 60.02 క్యారెట్లు ఉపయోగించబడ్డాయి. ఫోర్బ్స్ ప్రకారం, రెండవ మొసలిలో 18 క్యారెట్ల తెల్ల బంగారాన్ని ఉపయోగించారు మరియు దానిపై 66.86 క్యారెట్ల బరువున్న పచ్చలు ఉంచబడ్డాయి. దీంతో ఈ నెక్ల్సెస్ ధర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker