రక్తపు మడుగులో గాయని వాణీ జయరాం, పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు.

వాణీ జయరామ్ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని ఒమేదురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాణీ జయరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆమె తలకు ఒకటిన్నర ఇంచు గాయం అయినట్లు గుర్తించారు. అయితే ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో కన్నుమూసారు. ఇటీవలె కేంద్రం ఆమెకు కేంద్రం మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌తో గౌరవించింది. ఆ అవార్డు స్వీకరించక ముందే.. వాణీ జయరామ్ కన్నమూయడం విషాదకరం.
ఐతే.. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐతే ఇంట్లో పనిమనిషి వచ్చి డోర్ తెరకవపోవడంతో సమీపంలోని వ్యక్తుల మరియు పోలీసుల సహాయంతో డోర్లు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఇంట్లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో ఉందటంతో హుటాహుటిన సమీపంలో హస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఆమెను ఎవరైన హత్య చేసి ఉంటారా.. లేకపోతే కింద పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఆమె నుదురు తలపై ఎవరో బలంగా కొట్టినట్టు గాయాలున్నాయి. ఇక గాయని వాణీ జయరాం అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 78 యేళ్లు. ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వాణీ జయరామ్ విషయానికొస్త్తే.. అటు దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీ భాషల్లో తన సుమధుర గానంతో అలరించింది. ఉత్తమ గాయనీగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆమె సినీ ప్రస్థానం విషయానికొస్తే.. తెలుగు పాటకు పల్లకీ ఆమె గాత్రం… ఆమె గాత్రంలో అందమైన, అద్భుతమైన పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి…ఆమె పాట సమ్మోహన పరుస్తుంది..పరవశింపచేస్తుంది.
ఒక్కసారి వింటే తృప్తి కలగదు..మళ్లీ మళ్లీ అదే పాట వినాలనిపిస్తుంది…కోయిల కూసినట్టు, గలగలా గోదారి పరుగులు పెట్టినట్టు, గంగమ్మ ఉరకలెత్తి వచ్చినట్టు…ఆమె పాట అనేక భావాలను మోసుకొస్తుంది…తన గానమృతంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన గాత్రం వాణీ జయరాం సొంతం. వాణీ జయరాం తెలుగు సహా దాదాపు 19 భాషల్లో పాటలు పాడారు.